ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మరికొన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తులు మొదలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ మళ్ళీ ప్రధాని అవుతాడా ? కాదా ? అన్న విషయం పై తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ జోస్యం చెప్పాడు? సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని కాంత్ ఈ మద్యే పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ పార్టీని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న అయన మోడీ మళ్ళీ ప్రధాని అవుతారా ? కారా ? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం విశేషం.
ప్రధాని మోడీ మరోసారి ప్రధాని అవుతారా ? అన్న ప్రశ్నకు సమాధానంగా రజని కాంత్ మాట్లాడుతూ బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అన్న విషయం మే 23న తెలుస్తుంది అంటూ మెల్లగా దాటవేశారు. అయితే తప్పకుండా మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని రజని తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్టు సమాచారం. ఇటీవలే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజని తన పార్టీని ఈ సారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దించలేదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పక పోటీలో పాల్గొంటున్నట్టు అయన తెలపడంతో రజని ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఇప్పటి వరకు రజని కాంత్ తన పార్టీ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ పేరుతొ పటు కార్యాచరణ ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక రజని కాంత్ ప్రస్తుతం సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయిన అయన తాజాగా మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వీలైనన్ని సినిమాలు చేసేసి .. ఆ తరువాత రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట రజని. ప్రస్తుతం రజని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుపుకుంటుంది.
688897 30872I appreciate your function , thanks for all of the informative blog posts. 180965
694319 350027Precisely what I was looking for, thankyou for putting up. 157840
625259 664836This internet web site is typically a walk-through its the data you wished concerning this and didnt know who ought to. Glimpse here, and youll certainly discover it. 864554