Switch to English

రాజుగారి ఫ్రస్ట్రేషన్‌: నన్ను రాజీనామా చేయమని డిమాండ్‌ చేసేదెవడ్రా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మీడియా ముందుకొస్తే, చాలా పద్ధతిగా మాట్లాడే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కాస్త సంయమనం కోల్పోతున్నారు. అందుక్కారణం, ‘చంపేస్తాం’ అని కొందరు బెదిరించడమేనట. ‘ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? లేదా? నీ అంతు చూస్తాం..’ అంటూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు తనను బెదిరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు రఘురామకృష్ణరాజు. దాదాపుగా ప్రతిరోజూ రఘురామకృష్ణరాజు మీడియా ముందుకొస్తున్నారు. ఇది ఆయనకు ఓ దినచర్యలా మారిపోయింది.

ఈయన పార్టీకి రాజీనామా చేయరు.. వైసీపీ అధిష్టానమేమో ఆయన్ని సస్పెండ్‌ చేయదు. చూస్తోంటే, ఇదంతా ఓ పెద్ద డ్రామా అని అన్పించకమానదు ఎవరికైనా. ‘దమ్ముంటే ఎవడైనా నా దగ్గరకి వచ్చి మాట్లాడండి.. ఎక్కువ చేస్తే, నాకు రక్షణగా వున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మిమ్మల్ని కాల్చి పారేస్తారు..’ అంటూ రఘురామకృష్ణరాజు కొందరికి సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చేశారు.

ఇక, గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి గురించి సీఎస్‌కి ఫిర్యాదు చేసినా స్పందన సరిగ్గా లేదనీ, ఈ నేపథ్యంలో తాను లోకాయుక్తని ఆశ్రయించానని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. అక్కడా తనకు న్యాయం జరగకపోతే, పార్లమెంటు సభ్యుడిగా తనకున్న హక్కుల్ని వినియోగించుకుంటానని చెప్పారు. ‘రాజధాని అమరావతి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. న్యాయమే జరుగుతుంది రైతులకి.

మా ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా మొండిగా వ్యవహరించడం సరికాదు. మా ప్రియమైన ముఖ్యమంత్రి అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుని, మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నాను..’ అని సెలవిచ్చారు రఘురామకృష్ణరాజు. ఆవేశంతో ఊగిపోతూ, వైసీపీ మద్దతుదారులకి వార్నింగులు ఇచ్చేస్తోన్న రఘురామకృష్ణరాజుకి తెలియదా.. అవన్నీ పార్టీ అధిష్టానం చలవతోనే జరుగుతున్నాయని.! వైసీపీలో అధిష్టానం అంటే ఎవరో ఆయనకి తెలియదా.? అయినాగానీ, ఆయనగారికి ముఖ్యమంత్రి అంటే గొప్ప నమ్మకం.. ముఖ్యమంత్రి మీద అపారమైన గౌరవం. ‘ఎవడ్రా నన్ను రాజీనామా చేయమని డిమాండ్‌ చేసేది.? నా ఇష్టం నేను రాజీనామా చెయ్యనుగాక చెయ్యను..’ అంటూ ఓ దశలో పూర్తిస్థాయిలో సంయమనం కోల్పోయారు రఘురామకృష్ణరాజు మీడియా సమావేశంలో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...