Switch to English

ఎక్స్ క్లూజివ్: లెస్ రెస్ట్, వర్క్ మోర్ అంటున్న ప్రభాస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘సాహో’ తర్వాత దాదాపు రెండున్నర నెలలు గ్యాప్ తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ తన తదుపరి సినిమా ‘జాన్’ కోసం కెమెరా ముందుకు వచ్చారు. నవంబర్ 18 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుందని మేము ఎక్స్ క్లూజివ్ గా ఇదివరకే తెలియజేసాం. కానీ షూటింగ్ వాయిదా పడింది. దానికి కారణం అనుకున్న సెట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం.

1970 నాటి లండన్ ని తలపించేలా వేస్తున్న సెట్ వర్క్స్ కి కాస్త టైం పడుతుంది. ఎక్కువ భాగం ఈ నెల 25వ తేదీ లోగా షూట్ మొదలవుతుంది. సుమారు 20 రోజులపాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – పూజ హెగ్డేలపై వచ్చే ఓ మేజర్ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు.

బిఫోర్ షూట్ షెడ్యూల్ వల్ల కాస్త డిలే అయినా పర్లేదు కానీ షూట్ మొదలయ్యాక మాత్రం అస్సలు ఇలాంటి డిలే ఉండకూడదని ప్రభాస్ ఈ చిత్ర టీంకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట. అలాగే షెడ్యూల్స్ కి అసలు పెద్ద గాప్స్ లేకుండా లెస్ రెస్ట్, వర్క్ మోర్ అనేలా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడు మొదలైన షెడ్యూల్ డిసెంబర్ 10 వరకూ జరుగుతుంది.

ఆ తర్వాత 10 డేస్ బ్రేక్ తీసుకొని డిసెంబర్ 20 నుంచి 20-25 రోజుల పాటు జరగబోయే లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ సారి ఫిల్మ్ ప్రొడక్షన్ లేట్ అయ్యి బడ్జెట్ అనేది ఏ మాత్రం పెరగకూడదని ప్రభాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉండడమే కాకుండా, షూట్ ని కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా 1970లలో ఉన్న లండన్ ని రీ క్రియేట్ చేస్తూ సుమారు 25 రకాల డిఫరెంట్ సెట్స్ ని హైదరాబాద్ లో వేస్తున్నారు. మొదట లండన్ లో మేజర్ పార్ట్ అనుకున్నప్పటికీ బడ్జెట్ దృష్ట్యా ఇక్కడే సినిమా చేస్తున్నారు.

ప్యూర్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమాకి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్టర్. గోపికృష్ణ మూవీస్ – యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని కూడా మల్టిపుల్ లాంగ్వేజస్ లో షూట్ చేస్తూ, పాన్ ఇండియా ఫిల్మ్ గానే రిలీజ్ చేయనున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...