రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతమాత్రం ఇప్పుడు టాలీవుడ్ యాక్టరే కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. నేషనల్ వైడ్ లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. బాహుబలి తర్వాత చేసిన సాహో బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ లో సాధించిన విజయం ప్రభాస్ పాపులారిటీని తెలియజేయడానికి ఒక మచ్చుతునక మాత్రమే. అయితే ప్రభాస్ క్రేజ్ నేషనల్ వైడ్ లోనే కాదు ఆసియా అంతటా పాకిందని తాజాగా ఒక సర్వేలో తేలింది.
బ్రిటిష్ న్యూస్ వీక్లీ, ఈస్టర్న్ ఐ చేపట్టిన ఈ సర్వేలో ఫ్యాన్స్ వోటింగ్స్ ద్వారా ఆసియా టాప్ సెక్సియస్ట్ లిస్ట్ వేస్తె అందులో టాప్ 10 లో ప్రభాస్ కు చోటు దక్కింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ కండల వీరుడు హ్రితిక్ రోషన్ టాప్ ప్లేస్ ను చేజిక్కించుకోవడం విశేషం.
సౌత్ ఇండియా నుండి మరే హీరో కూడా టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా టాప్ 10 లో చోటు దక్కలేదు. కనీసం టాప్ 20 లో కూడా లేడు. మహేష్ కు టాప్ 100 లో 34వ స్థానం దక్కింది. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రన్బీర్ కపూర్, విరాట్ కోహ్లీ.. వీళ్ళందరూ టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ ప్రేమకథలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.
