Switch to English

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: కృష్ణంరాజు వారసుడి నుంచి యంగ్ రెబల్ స్టార్ గా ‘ప్రభాస్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘వారసత్వం హోదా మొదటి సినిమా వరకే.. తర్వాతి సినిమా నుంచి తమను తాము ప్రూవ్ చేసుకోకపోతే ఎవరూ ఏమీ చేయలేర’నేది సినీ నానుడి. ఇదే నిజం కూడా. నేటి జనరేషన్ లో టాప్ హీరోలంతా సీనీ దిగ్గజాలకు వారసులే. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన అన్న కొడుకునే.. తన సినీ వారసుడిగా ప్రకటించారు.

చెప్పాలంటే కృష్ణంరాజు తన సినీ వారసత్వాన్నయితే ఇచ్చారు కానీ.. భారీ ఫ్యాన్ బేస్ ను ప్రభాస్ కు ఇవ్వలేదనే చెప్పాలి. ఆ బ్యాక్ గ్రౌండ్ తోనే ప్రభాస్ చేసిన మొదటి సినిమా ‘ఈశ్వర్’. అప్పటి క్రేజీ డైరక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రభాస్ ఊర మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా హిట్ అయింది. అక్కడి నుంచి ప్రభాస్ ప్రయాణం మొదలైంది.

వర్షంతో యాక్షన్ హీరోగా..

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: కృష్ణంరాజు వారసుడి నుంచి యంగ్ రెబల్ స్టార్ గా ‘ప్రభాస్’

ఈశ్వర్ తర్వాత ఫ్లాపులు చూసినా ప్రభాస్ పట్టుదల వీడలేదు. ప్రభాస్ లోని హీరోయిజంను నిర్మాత ఎం.ఎస్.రాజు బయటకు తీశారు. యాక్షన్, లవ్ సబ్జెక్ట్ రెడీ చేసి ప్రభాస్ తో సినిమా చేశారు. ఆ సినిమానే ‘వర్షం’. అమితాబ్ కు దీవార్, చిరంజీవికి ఖైదీలా ప్రభాస్ కు వర్షం నిలుస్తుందని సినిమా రిలీజ్ కు ముందు చెప్పిన నిర్మాత మాటలు అక్షర సత్యలయ్యాయి. బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రభాస్ లోని యాక్షన్, నటన తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది వర్షం. యాక్షన్ హీరోగా, సేలబుల్ హీరోగా పరిశ్రమలో వెనుదిరిగి చూసే పని లేకుండా పోయింది. పాటలు, యాక్షన్, కామెడీతో రాణించి అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో ప్రభాస్ సినిమాలపై క్రేజ్ పెరిగింది. దీంతో వరుస అవకాశాలే ప్రభాస్ కు వచ్చాయి. అయితే.. మళ్లీ ఫ్లాపులు పలకరించినా తన మార్క్ ని వదల్లేదు.

ఛత్రపతితో మాస్ యుఫోరియా..

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: కృష్ణంరాజు వారసుడి నుంచి యంగ్ రెబల్ స్టార్ గా ‘ప్రభాస్’

ప్రభాస్ లోని మాస్ కటౌట్ ను పూర్తిస్థాయిలో వెలికితీసింది దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమానే ‘ఛత్రపతి’. ఈ సినిమాలో ప్రభాస్ తన క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పాలి. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్ కుర్రకారును ఊపేశాయి. ఫైట్లు, యాక్షన్ తో ప్రభాస్ సినిమాను ఒన్ మ్యాన్ షో చేసేశాడు. అప్పటికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తున్న రాజమౌళి తన హీరోను ఎంత మాసివ్ గా చూపాలో అంతటినీ ప్రభాస్ లో చూపించారు. డ్యాన్సుల్లో కూడా ప్రభాస్ ఓకే అనిపించడంతో ఆయనకు ఫ్యాన్స్ పెరిగారు. ట్రేడ్ లో బిజినెస్ పెరిగింది. దీంతో ప్రభాస్ టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అక్కడి నుంచి ప్రభాస్ కు తిరుగు లేకుండా పోయిందని చెప్పాలి. మొదటి సినిమాకు కొంతవరకూ ఉన్న ఫ్యాన్ బేస్ మాస్ హిట్లతో సొంతంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు ప్రభాస్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...