ప్రభాస్ లండన్లో వున్నాడిప్పుడు. ఆదివారం రాత్రి అక్కడ ఫేమస్ రాయల్ అల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ను దర్శకుడు రాజమౌలి, దేవసేన అనుష్క భల్లాలదేవ రానా దగ్గుబాటి, చిత్రనిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తదితరులతో కలిసి చూశాడు.
సినిమా కోసం కీరవాణి అందించిన నేపథ్య సంగీతాన్ని మ్యూట్ చేసి, లైవ్ ఆర్కెస్ట్రాతో అదే సంగీతాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రత్యేకత. ఈ ప్రదర్శన పూర్తయినా… మరో మూడునాలుగు రోజులు ప్రభాస్ లండన్లో వుంటారని టాక్. బుధవారం ప్రభాస్ పుట్టినరోజు. లండన్లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నార్ట. ‘
సాహో’ విడుదలైనప్పటి నుండి ప్రభాస్ ఏదో సిటీ తిరుగుతూ ఉన్నాడు. మరి, రాధాకృష్ణ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం సంగతేంటి? మళ్ళీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అభిమానుల మదిలో ప్రశాలెన్నో! ప్రభాస్ 20 షూటింగ్ మళ్ళీ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. వచ్చే నెలలో ఈ సినిమాకు ప్రభాస్ 20 రోజులు డేట్స్ ఇచ్చాడు.
మెజార్టీ లవ్ ఎపిసోడ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఆమె తండ్రిగా మురళీ శర్మ నటిస్తున్నారు.
496133 588241Hello! I just now would select to supply a enormous thumbs up with the great data you could have here within this post. I will probably be coming back to your weblog site for additional soon. 938281