పవన్ కల్యాణ్.. ఆ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇక నేరుగా చూస్తే వారి ఆనందానికి అవధులే ఉండవ్. సినిమా హీరో కంటే కూడా వ్యక్తిత్వంగా పవన్ ను అభిమానించేవాళ్లు చాలా ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేని మనస్తత్వం.. అలాంటి వారికి సాయం చేయడం.. చేసిన సాయం గురించి చెప్పుకోకపోవడం వంటి లక్షణాలు ఆయన్ను ఎంతో ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. అలాంటి వ్యక్తి.. సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు.
గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్.. ఈసారి ఎన్నికల బరిలోకి సై అంటూ వచ్చారు. వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీలను కలుపుకొని పోటీ చేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ లకు గట్టి పోటీనిస్తుందా? చక్రం తిప్పే స్థాయిలో సీట్లు కొల్లగొడుతుందా? కింగ్ అవుతుందా లేక కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందా? అనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో పవన్ పాత్ర నామమాత్రమేనని, ఆయనకు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని పలు సర్వేలు స్పష్టంచేశాయి. ఒకవేళ పవన్ ప్రభావం ఏమైనా ఉంటే అది శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలకు మాత్రం పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. అయితే, పవన్ స్టామినాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2014 ఎన్నికల్లో పవన్ చేసిన ప్రచారమే తెలుగుదేశం అధికార పీఠం అధిరోహించడానికి కారణమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ వారి నుంచి ఏమీ ఆశించలేదు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా తమవారికి పదవులో, కాంట్రాక్టులో ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ పవన్ అలాంటి పనులేవీ చేయకపోవడం ఆయనపై మరింత ఆదరణ పెరగడానికి కారణమైంది.
పైగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసలు అందుకున్నాయి. అంతేకాకుండా రాజధానిలో భూములు కోల్పోయినవారి పక్షాన గళం విప్పి పోరాడారు. ఒక విధంగా చెప్పాలంటే.. ప్రభుత్వంలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు కూడగడతానంటూ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ ఎంపీలు సక్రమంగా పనిచేయడంలేదని ఘాటుగా విమర్శలు కూడా చేశారు. హోదాపై యూటర్న్ తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునీ తప్పుబట్టారు. ఇవన్నీ పవన్ పై కొంత భరోసా కల్పించడానికి కారణమయ్యాయి.
ఇలాంటి తరుణంలో ఈసారి నేరుగా ఎన్నికల్లోకి దిగిన పవన్.. తాము అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి సమానదూరం పాటిస్తామని స్పష్టంచేశారు. అయితే, పవన్ రాకతో వైఎస్సార్ సీపీలో కలవరం మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆయన చీల్చే అవకాశం ఉందని, అది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందారు. దీంతో జనసేన లక్ష్యంగా విమర్శలు మొదలుపెట్టారు. టీడీపీ, జనసేన రెండూ ఒకటేనని.. చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ వైఎస్సార్ సీపీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోయారు.
చెట్టు కింద కూర్చుని ముంతలో అన్నం తినడం.. నడిరోడ్డుపైనే కూలబడి టీ తాగడం, నులకమంచంపైనే విశ్రమించడం వంటి అంశాలు సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా చేసింది. పవన్ కల్యాణ్ కూడా వ్యూహాత్మకంగా తాము ఎక్కడైతే బలంగా ఉండి, గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించారో.. అవే ప్రాంతాలపై ప్రధాన దృష్టి సారించారు. ఈ అంశాలన్నీ ఆయనకు సానుకూలంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేలా జనసేన సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆయనకు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి పూర్తిగా మెజార్టీ వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉందని, అలాంటి తరుణంలో పవన్ కీలకం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే.
125449 577889Official NFL jerseys, NHL jerseys, Pro and replica jerseys customized with Any Name / Number in Pro-Stitched Tackle Twill. All NHL teams, full range of styles and apparel. Signed NFL NHL player jerseys and custom team hockey and football uniforms 817872
644362 809991Some truly outstanding articles on this internet site , thankyou for contribution. 558015
705766 361298Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects more via the www often. earn money 919564