మహర్షిగా ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 25వ సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 2000 థియేటర్స్ కి పైగా విడుదల అవుతున్న ఈ సినిమా తరువాత మహేష్ నటించే తదుపరి చిత్రం అనిల్ రావిపూడితో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనిల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు. అన్ని త్వరగా పూర్తీ చేసి ఈ సినిమాను జూన్ చివర్లో సెట్స్ పైకి తెచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మాజీ హీరోయిన్ లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తరువాత మహేష్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు దర్శకుడు పరశురామ్. గత ఏడాది విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమాతో ఏకంగా వందకోట్ల క్లబ్ లోకి వెళ్లిన ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటికేపలువురు హీరోలతో చర్చలు జరిపాడు పరశురామ్. నిజానికి అల్లు అర్జున్ తో కూడా సినిమాకు ప్లాన్ చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో పాటు మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట, త్వరలోనే మహేష్ తో కథా చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.
మహేష్ కూడా అతనితో సినిమా చేసే ఆసక్తితో ఉన్నట్టు టాక్. సో మహేష్ నెక్స్ట్ సినిమా విషయంలో పరశురామ్ లైన్ లోకి ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిట్టింగ్ ఒకే అయిందంటే ఈ సినిమాను నిర్మించేందుకు గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉంది. అల్లు అరవింద్ ఎప్పటినుండో మహేష్ తో తమ బ్యానర్ లో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు. అన్ని వర్కవుట్ అయితే ఈ సినిమా మహేష్ 27వ సినిమాగా పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి.