Switch to English

తెలంగాణాపై ఎక్కుపెట్టిన వైఎస్‌ జ’గన్‌’,!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకుంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారనీ, ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నది సాధించిన వైఎస్‌ జగన్‌, తదుపరి తెలంగాణాపై దృష్టి పెడతారట. అయితే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీలో జగన్‌ గెలుపును ముందే ఊహించి, తెలివిగా ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి వైఎస్‌ జగన్‌ని ఆహ్వానించారు. తద్వారా తెలంగాణాలో జగన్‌ నుండి తనకు థ్రెట్‌ లేకుండా చూసుకున్నారు కేసీఆర్‌.

జగన్‌ ప్రభంజనం ఎలా ఉంటుందో కేసీఆర్‌కి ముందే తెలుసు. 2014 ఎన్నికల సందర్భంలోనే జగన్‌ ప్రభంజనంపై కేసీఆర్‌ అంచనాలు ఆకాశంలో ఉండేవి. అయితే, అప్పట్లో ఆ అంచనాలు బెడిసికొట్టాయి. జగన్‌ సమైక్యాంధ్రకు జై కొట్టినా, తెలంగాణాలో ఓ ఎంపీ సీటు, రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత వాటిని కేసీఆర్‌ లాగేసుకున్నారు. మరి జగన్‌, కేసీఆర్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా టీఆర్‌ఎస్‌కి వైసీపీ మద్దతిచ్చింది. కానీ, ఇకపై రాజకీయాలు వేరే లెవల్లో ఉంటాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కోమటిరెడ్డి, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికి కాంగ్రెస్‌లోనే ఉన్నా, వైఎస్‌ జగన్‌ పట్ల అమితమైన ప్రేమను చాటుకున్నారాయన.

తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న వేళ కాంగ్రెస్‌ నేతలు వైఎస్‌ జగన్‌ వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే, తెలంగాణాలో కేసీఆర్‌కి వైఎస్‌ జగన్‌ రూపంలో రాజకీయంగా థ్రెట్‌ తప్పదు. అయితే, ఇప్పటికిప్పుడు జగన్‌ అంత ఎగ్రసివ్‌గా తెలంగాణాలో రాజకీయాలు చేస్తారనీ అనుకోలేం. ఓ రెండేళ్లదాకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ పైనే జగన్‌ ఫోకస్‌ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు వెతకాలి. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించగలగాలి. రెండు, మూడేళ్లు ఆగ్నిపరీక్షనే ఎదుర్కోవాలి వైఎస్‌ జగన్‌.

ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌ వీటిన్నింటినీ ఓ కొలిక్కి తెచ్చి మరింత బలం పుంజుకుంటే, ఆ తర్వాత తెలంగాణాలోనూ చక్రం తిప్పడానికి మార్గం సులభతరమవుతుంది. ఈ లోగా తెలంగాణాలో పార్టీని విస్తరించే ప్రక్రియ చాప కింద నీరులా ప్రారంభించాల్సి ఉంటుంది. కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నాల లక్ష్యయ్య ఇలాంటి వైఎస్‌ సానుభూతిపరులు జగన్‌ వైపుకు తిరగడానికి పెద్దగా టైమ్‌ పట్టదు. ఇంకో ఏడాదిలోనే తెలంగాణా రాజకీయాల్లో వైసీపీ ఉనికి కనిపిస్తుందని కాంగ్రెస్‌లోని వైసీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. దానర్ధం తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీగా మారబోతోందనేనేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...