Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన ‘కమ్మ’దనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడానికి కారణం కమ్మ సామాజిక వర్గమే అనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. తెలంగాణా భాషా, యాస, ఉనికి మీద దాడి చేసింది ఆ కమ్మ సామాజిక వర్గమేనంటారు కొందరు. ఇక్కడ సామాజిక వర్గం అంటే, సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులని అర్ధం. అందులోనూ అందరూ కాదు.. కొందరు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో వీరి పెత్తనం మరీ ఎక్కువైపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, మొత్తంగా ఈ సామాజిక వర్గం చుట్టూనే అధికారం కేంద్రీకృతమైపోయింది. అధికారుల బదిలీ దగ్గర్నుంచీ, కాంట్రాక్టర్ల దాకా, కేటాయింపుల దగ్గర్నుంచీ, అభివృద్ధి ఫలాల దాకా అంతా ఆ సామాజిక వర్గం కనుసన్నల్లోనే నడిచింది. రాజధాని అమరావతి కూడా ఆ సామాజిక వర్గం కోసమే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇంతలా వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్ఠుపట్టించేశారు.

రాజకీయమంటే, తన సామాజిక వర్గమే అనుకున్నారాయన. ఆ ఎఫెక్ట్‌ తాజా ఎన్నికలపై చాలా గట్టిగా పడింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కొందరు కమ్మ సామాజిక వర్గ నేతలు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. టీడీపీ కుల గజ్జిని వదిలించుకున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో 17 మంది మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అసెంబ్లీకి వెళ్లారు (పోటీ చేసినవి 42). గతంలో ఈ సంఖ్య 33 (2014 లో). అంతకు ముందు 28 (2009 లో). ఇంత గణనీయంగా కమ్మ సామాజిక వర్గం ఏపీ రాజకీయ తెరపై పలచన అయిపోవడం ఆ సామాజిక వర్గ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

కమ్మ సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు. మరో సామాజిక వర్గం కావచ్చు.. నేతలకు కులాభిమానం ఉంటే తప్పు కాదు. కేవలం కులం పేరు చెప్పి, రాజకీయం చేయాలనుకున్నప్పుడే పరిస్థితులు తిరగబడతాయి. చంద్రబాబు కులతప్పు టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి పెద్ద దెబ్బ తగిలేలా చేసింది. అయితే, ఎన్నికల ముందర పోలీస్‌ శాఖలో బదిలీల సందర్భంగా కమ్మ సామాజిక వర్గానికే చంద్రబాబు సర్కార్‌ పెద్ద పీట వేసిందనే విమర్శలు వినిపించాయి. అదెంత నిజం.? అనేది వేరే చర్చ. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. చంద్రబాబు ఒకప్పుడు తాను పెద్ద మాదిగనని చెప్పుకున్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కుల పిచ్చితో ఉంటారని ఎవరూ అనుకోరు. కానీ ఆయన చేష్టలూ, చుట్టూ ఉన్న వారి రంకెలు వెరసి ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయంగా దాదాపుగా డైల్యూట్‌ చేసేసింది. భవిష్యత్తులో మళ్లీ పుంజుకోవడం సాధ్యమేనా.? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

రాజకీయమంటే, కులమతాలకు అతీతంగా ఉండాల్సిన వ్యవహారం. కానీ, కులం గురించీ, మతం గురించీ మాట్లాడకుండా రాజకీయాల్ని విశ్లేషించలేని పరిస్థితి వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడైనా ఆయన్ని ఎవరూ ఎప్పుడూ ఆలా చూడలేదు. అన్ని కులాలకూ, అన్ని మతాలకూ ప్రాధాన్యత ఇచ్చారాయన. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ మాత్రం క్రమ క్రమంగా భ్రష్ఠు పడుతూ వచ్చి కులమే పరమావధి అన్నట్లుగా మారింది. ఈ పతనం ఎందాకా.? ఆంధ్రప్రదేశ్‌లో సంఖ్యాబలం పరంగా చూస్తే కమ్మ సామాజిక వర్గానిది చాలా వెనుక స్థానం. కానీ, రాజకీయంగా చాలా ముందుకు దూసుకొచ్చింది. వచ్చినట్లే వచ్చి మళ్లీ కిందికి పడిపోతోంది. ఈ ఘనత ముమ్మాటికీ చంద్రబాబుదే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...