Switch to English

మెగా ‘సైరా’.. అయినా ఎందుకు ‘నో’ నయనతారా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నయనతార సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. హయ్యస్ట్‌ పెయిడ్‌ యాక్ట్రెస్‌ ఇప్పుడు సౌత్‌లో ఎవరంటే అది నయనతార మాత్రమే. నయనతారతో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. హీరో కంటే ఎక్కువగా నయనతార రెమ్యునరేషన్‌ పొందుతోంది చాలా సినిమాలకి. అఫ్‌కోర్స్‌, ఆ స్థాయిలో నయనతార సినిమాలకి బిజినెస్‌ అవుతోందనుకోండి.. అది వేరే సంగతి.

ఇదిలా వుంటే, తెలుగు సినిమాల్లో నయనతార అడపా దడపా కన్పిస్తున్నా, ఎందుకో ఆమె తెలుగు సినిమాల ప్రమోషన్‌కి మాత్రం రావడంలేదు. ‘సైరా’ సినిమా ప్రమోషన్‌కి కూడా నయనతార ‘నో’ చెప్పేసిందనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, నిర్మాత రామ్‌చరణ్‌, నయనతార నుంచి ‘ప్రమోషన్‌’ విషయమై హామీ పొందాడనీ, రైట్‌ టైమ్‌లో ఆమె ప్రమోషన్లకు ‘ఎంట్రీ’ ఇస్తుందనీ ఇంకో వాదన విన్పిస్తోంది.

ప్రస్తుతానికైతే నయనతారతో సంబంధం లేకుండా సినిమాపై విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయిన మాట వాస్తవం. అయితే, నయనతార ప్రచారం సినిమాకి అదనపు మైలేజ్‌ తెస్తుందన్నది నిర్వివాదాంశం. నిజానికి, ప్రమోషన్స్‌ ఇప్పుడే మొదలయ్యాయి. ముంబైలో ప్రెస్‌మీట్‌ జరిగింది.. అక్కడ తమన్నాతో మేనేజ్‌ చేసేశారు. అతి త్వరలో హైద్రాబాద్‌ సహా సౌత్‌లోని పలు నగరాల్లో ప్రెస్‌మీట్లు జరగబోతున్నాయట. వీటిల్లో ఎన్ని ప్రెస్‌మీట్స్‌కి నయనతార అటెండ్‌ అవుతుందన్నది చర్చనీయాంశంగా తయారయ్యింది.

తమిళ సినిమాల ప్రమోషన్లకైతే నయనతార బాగానే కన్పిస్తుంటుంది. తెలుగు సినిమాకొచ్చేసరికే, ఎందుకో ఆమె అంతలా ఆసక్తి చూపదు. నిజానికి, సినిమా ఒప్పుకున్నప్పుడే ప్రమోషన్‌ విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేస్తుందట నిర్మాతల వద్ద నయనతార. ఇంతకీ, ‘సైరా’ సినిమా ప్రమోషన్లలో నయనతార అప్పీయరెన్స్‌ గురించి మనం ఎంతవరకు ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు.? ఏమో, ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేని పరిస్థితి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...