తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) యువ గళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ క్యాంపస్ లోని స్టూడెంట్స్, యూత్ తో ఇంట్రాక్ట్ అయ్యారు. విద్యార్థులతో ముచ్చటిస్తుండగా ఆయనకి తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురయింది. దానికి లోకేష్ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, అయితే తన మామయ్య బాలకృష్ణకి భయపడినట్లు చెప్పారు.
అదే సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) తల్లి భువనేశ్వరి అనుకోకుండా తమ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని అందుకు బ్రాహ్మణి కూడా ఒప్పుకున్నట్లు తెలిపారు. తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అంటూ అక్కడున్న వాళ్ళందర్నీ నవ్వించారు.
లోకేష్ తన మేనమామ నందమూరి బాలకృష్ణ( Balakrishna)పెద్ద కుమార్తె బ్రాహ్మణి ని 2007లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కొడుకు నారా దేవాన్ష్ ఉన్నాడు. లోకేష్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటుండగా.. బ్రాహ్మణి హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్నారు.