Switch to English

చంద్రబాబే ముఖ్యమంత్రి.. జనసేన పార్టీతో నో పవర్ షేరింగ్: నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చంద్రబాబే ముఖ్యమంత్రి.. జనసేన పార్టీతో పవర్ షేరింగ్ ప్రశ్నే ఉత్పన్నం కాదు.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. 2024 ఎన్నికల కోసం టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండూ పార్టీలూ చెరి సగం కాలం అధికారాన్ని పంచుకోవాలంటూ కొన్ని ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయి.

జనసేన శ్రేణులు కూడా పవర్ షేరింగ్ అంశం ఖచ్చితంగా పొత్తుల చర్చల్లో వుంటుందనే భావిస్తున్నాయి. అయితే, ఈ విషయమై ఇంతవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా అధికారిక ప్రకటన చేసింది లేదు. కొందరు జనసేన నేతలు మాత్రం, పవర్ షేరింగ్ గురించి మాట్లాడుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘పవర్ షేరింగ్’ అంశం, రెండు రాజకీయ పార్టీల మధ్యా ‘ఓటు ట్రాన్స్‌ఫర్’ సజావుగా సాగడానికి ఉపకరిస్తుంది. ‘పవర్ షేరింగ్ అంశంపై అధినాయకత్వం స్థాయిలో చర్చలు జరుగుతాయి..’ అనాల్సిన నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో, ఇంతటి తేలిక వ్యాఖ్య ఎలా చేయగలిగారంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

నిన్ననే నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ‘నా పెద్దన్న పవన్ కళ్యాణ్..’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇంతలోనే, నారా లోకేష్ నుంచి పవర్ షేరింగ్ విషయమై తేలిక వ్యాఖ్యలు.. అందునా, జనసేనను లైట్ తీసుకుంటున్నట్లుగా లోకేష్ ఆటిట్యూడ్.. ఇవన్నీ జనసేన శ్రేణులకు అస్సలు మింగుడుపడ్డంలేదు.

మరోపక్క, చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీయార్ స్పందించకపోవడంపై వ్యాఖ్యానించిన నారా లోకేష్, అది ఆయన వ్యక్తిగతం.. ఆయన విజ్ఞత.. అంటూ పేర్కొనడంపై జూనియర్ ఎన్టీయార్ అభిమానులు గుస్సా అవుతున్నారు. ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో లోకేష్ బాడీ లాంగ్వేజ్ అస్సలు బాగోలేదన్నది జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ఆరోపణగా కనిపిస్తోంది.

కాగా, పవర్ షేరింగ్ సహా జూనియర్ ఎన్టీయార్ అంశంపై నారా లోకేష్ ఇంకాస్త హుందాగా స్పందించి వుంటే బావుండేదని టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

1 COMMENT

  1. Hello there! I know this is kinda off topic nevertheless
    I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest authoring a blog
    article or vice-versa? My blog goes over a lot of the
    same subjects as yours and I believe we could greatly benefit from each other.
    If you might be interested feel free to send me an email.

    I look forward to hearing from you! Excellent blog by the
    way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...