జబర్దస్త్ టివి షో .. దాదాపు ఐదేళ్లకు పైగానే తెలుగు ప్రేక్షకులను కొత్త కొత్త కామెడీ స్కిట్స్ తో నవ్వించిన పాపులర్ టివి షో. ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఈ షో ఇకపై కనుమరుగు కానుందా ? అంటే అవుననే అంటున్నాయి టీవీ వర్గాలు. జబర్దస్త్ టివి షో ఈటీవీ లో ప్రసారం అవుతున్నా కూడా ఈ ప్రోగ్రాం ని చేస్తున్నది మల్లెమాల ప్రొడక్షన్ కంపెనీ.
ఈ మద్యే జబర్దస్త్ టివి షో దర్శకులు నితిన్, భరత్ లతో మల్లెమాల ప్రొడక్షన్ కు విభేదాలు వచ్చాయట. దాంతో ఆ దర్శకులు ఇద్దరు బయటికి వచ్చేసారు. వారు రావడమే ఆలస్యం .. వెంటనే జి టివిలో చేరిపోయారు. జబర్దస్త్ ని తలదన్నేలా మరో కామెడీ ప్రోగ్రాం డిజైన్ చేసారు కూడా. ఈ డైరెక్టర్స్ బయటకు రావడమే కాదు .. వాళ్లతో పాటు జడ్జ్ నాగబాబు .. కమెడియన్స్ ను బయటకు తెచ్చారు.
ఇకపై జబర్దస్త్ టివి షో కి నాగబాబు జడ్జ్ గా కనిపించడు అన్నది నిజం. అయితే ఈ విషయం పై కమెడియన్ చమ్మక్ చంద్ర స్పందించాడు. జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటికి వచ్చిన మాట వాస్తవమే. ఆయనతో పాటు మేంకూడా వచ్చేసాం. అయితే మళ్ళీ వెళ్ళొచ్చేమో చెప్పలేం. ఎందుకంటే జబర్దస్త్ అనేది మాకు లైఫ్ ఇచ్చింది, అది ఎవర్గ్రీన్ దానినుండి ఎవరు వదిలిపోయే ప్రసక్తే లేదు. కాకపోతే చిన్న బ్రేక్ ఇచ్చాము అంతే అని చెప్పాడు.
మొత్తానికి జబర్దస్త్ టివి షో లో లుకలుకలు మొదలైన మాట వాస్తవమే .. మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.
767663 7801Good to be visiting your weblog once much more, it continues to be months for me. Nicely this post that ive been waited for so lengthy. I want this post to total my assignment within the university, and it has very same topic together together with your post. Thanks, terrific share. 57589
21605 988110Spot lets start work on this write-up, I truly feel this fabulous site needs an excellent deal more consideration. Ill apt to be once more to learn far more, appreciate your that info. 555073