Switch to English

సినిమా రివ్యూ : కాంచన-3

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నటీనటులు : రాఘవ లారెన్స్, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, కోవై సరళ, శ్రీమాన్ తదితరులు ..
సంగీత : థమన్
కెమెరా : వెట్రి
నిర్మాత : కళానిధి మారన్
దర్శకత్వం : రాఘవ లారెన్స్

హర్రర్ సినిమాలంటే సౌత్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా చేసిన సినిమా కాంచన. అంతకుముందు వచ్చిన ముని సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా కాంచన చిత్రాన్ని తెరకెక్కించాడు రాఘవ లారెన్స్. కాంచన బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద దుమారమే రేపి హర్రర్ సినిమాల రేంజ్ మార్చేసింది. దాంతో ప్రేక్షకులను అటు వైపు మళ్లించింది. ముని సిరీస్ లో భాగంగా ఇప్పుడు కాంచన 3 వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూడో కాంచన ఎవరు ? అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ :

రాఘవ ( రాఘవ లారెన్స్ ) అతనికి దెయ్యాలంటే తెగ బయపడిపోతాడు. వేరే విషయాల్లో ఏంతో డేర్ తో ఉండే రాఘవ ఇలా దెయ్యాలకు భయపడడం అన్నది అతని తల్లి ( కోవై సరళ ) అన్న ( శ్రీమాన్ ) లకు అస్సలు నచ్చదు. అందుకే అతన్ని అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ ఉంటారు. రాఘవ ఫ్యామిలీ వరంగల్లో ఉన్న తన తాత షష్టిపూర్తి వేడుకకు అక్కడికి వస్తారు. ఆ తరువాత ఆ ఇంట్లో రెండు దెయ్యాలు ఉన్నాయని తెలుసుకుంటారు. వాటిని తరిమికొట్టే విషయంలో సీన్ రివర్స్ అయి ఆ రెండు దెయ్యాలు రాఘవ్ ను ఆవహిస్తాయి. దాంతో రాఘవ పైనున్న ఆ దెయ్యాలను పంపించేందుకు ఎలాంటి పనులు చేసారు? అసలు రాఘవ ఒంట్లో దూరిన ఆ రెండు దెయ్యాలు ఎవరు ? అన్న విషయమే మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ముని సిరీస్ లో భాగంగా కాంచన పేరుతొ తెరకెక్కిన నాలుగో సిరీస్ ఇది. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా ఎంటర్ టైనర్ బేస్ గా సాగుతుంది. సమాజానికి సేవ చేస్తున్న వారిని విలన్ అన్యాయంగా, అతి కిరాతకంగా చంపడం, దాంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు దెయ్యంగా మారి మరో వ్యక్తిలోకి ప్రవేశించి .. అతని ద్వారా పగ తీర్చుకోవడం అన్న కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సినిమాలో నటీనటుల పరంగా కొత్తగా చేసింది ఏమిలేదు. కాంచన సినిమాను కాస్తంత సాగదీసే ప్రయత్నం చేసాడు లారెన్స్. ఇక నటన విషయంలో లారెన్స్ ఎప్పటిలాగే చేసాడు. అతని మరదలుగా ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి కాస్త గ్లామర్ తో పాటు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. ఇక కోవై సరళ ఎప్పటిలాగే కామెడీ తల్లిగా నవ్వించే ప్రయత్నం చేసింది. కాకపోతే కాస్త ఓవర్ యాక్షన్ అయినట్టుంది. ఇక శ్రీమాన్, మిగతా నటీనటులు కూడా ఎవ్వరు తగ్గమన్నట్టు అందరు ఓవర్ యాక్షన్ చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

కాంచన సిరీస్ కు సంగీతం అందించిన థమన్ మరోసారి అందించిన ఆర్ ఆర్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. హర్రర్ సినిమాలను కెమెరా పనితనం ప్రధానమైంది. ఈ విషయంలో వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాణ విలువలకు డోకా లేదు. అయితే దర్శకుడిగా రాఘవ లారెన్స్ రెగ్యులర్ ఫార్ములా మునిని తీసుకుని నాలుగో సిరీస్ గా చేసిన ఈ సినిమా కథ ముందే తెలుసు. ఐతే గత సిరీస్ లో లాగా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే కథనం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కథలో ఏమాత్రం పట్టులేకపోవడంతో సినిమా పై ఆసక్తి తగ్గి బోర్ కొట్టిస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ సరైన రీతిలో కథను ఆసక్తికర మలుపులతో నడపలేకపోయాడు. సినిమాలో కామెడీ కోసం చేసే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కామెడీ అంటే ఫ్లో లో వస్తే నవ్వు తెప్పిస్తుంది కానీ నవ్వు తెపించేందుకు సన్నివేశాలు అల్లుకోవడం జీర్ణించుకోలేని అంశం.

విశ్లేషణ ;

హర్రర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రివెంజ్ డ్రామాగా సాగుతుంది. అయితే కథలో సరైన పాయింట్ లేకపోవడం. దెయ్యాలంటే భయపడిపోయే హీరో కావాలని చేసినట్టుగా ఉంది తప్ప, నాచురాలిటీ ఎక్కడ అనిపించదు. పైగా మిగతా పాత్రలతో బయపెట్టించే ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ముఖ్యంగా ఇంగ్లిష్ సినిమాను స్ఫూర్తి గా తీసుకుని లేడి దెయ్యాన్ని క్రియేట్ చేసాడు. అది కొత్తగా అనిపించకపోగా పక్కా కాపీగానే అనిపిస్తుంది. ప్రథమార్థంలో కథ ఎక్కడ ఆసక్తి లేకుండా సాగిపోవడం. పోనీ ద్వితీయార్థంలో అయినా అసలు కథ మొదలవుతుందేమో అనుకుంటే ఏమాత్రం ఆసక్తి లేని కథను చెప్పాడు. దెయ్యం కావడంకోసమే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అల్లుకున్నట్టుగా ఉంటుంది. ఇక రాఘవ లారెన్స్ ఆకట్టుకొని నటన, నటన అనేకంటే ఓవర్ యాక్షన్ అంటే బెటరెమో. ఏమాత్రం బయపెట్టని సన్నివేశాలు వెరసి .. కాంచన 3 ఎలాంటి ఆసక్తి కలిగించని సినిమాగా మిగిలిపోయింది. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన మూడో కాంచన బయపెట్టకపోగా .. విసుగు తెప్పించింది.

ట్యాగ్ లైన్ : చిరాకు తెప్పించిన దెయ్యం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...