మంచు ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చిన విష్ణు, మనోజ్‌లు తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు సరైన హిట్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. కాగా, మంచు మనోజ్ ఇటు ప్రొఫెషనల్‌గానే కాకుండా, పర్సనల్‌గానూ సఫర్ అవుతున్నాడు. ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకోబతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గతకొద్ది రోజులుగా జోరుగా చక్కర్లు కొడుతోంది. కానీ, ఈ విషయంపై మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ స్పందించలేదు. తాజాగా మంచు లక్ష్మీని ఇదే విషయంపై మీడియా వారు ప్రశ్నించారు. మనోజ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. విష్ణుతో మనోజ్‌కు విభేదాలు ఉన్నాయా అని మీడియా ఆమెను అడిగింది.
కాగా, తమ ఫ్యామిలీ విషయాలను అందరితో చెప్పాల్సిన అవసరం లేదని.. తాను, మంచు మనోజ్ చాలా క్లోజ్‌గా ఉంటామని.. అయితే విష్ణు తన కెరీర్, బిజినెస్, ఫ్యామిలీపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో మాతో అంత ఫ్రీగా ఉండడు. ఇక మనోజ్ పెళ్లి గురించి అతడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇంట్లో చర్చించాకే తీసుకుంటాడని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. మొత్తానికి మంచు హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది మంచు లక్ష్మీ.
179997 835590Respect to author , some great information . 212786
182763 164673This is some excellent info. I expect additional facts like this was distributed across the internet today. 647182
892732 645373Some truly superb articles on this internet web site , regards for contribution. 645018