రాజకీయాలు నిన్న మొన్నటిలా లేవు. ప్రాంతీయ పార్టీల్ని చావగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఏ అస్త్రాన్నీ వదిలిపెట్టడంలేదు. ఆ అస్త్రాల్లో ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలున్నాయన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. మతతత్వం సహా, చాలా ఇతర అస్త్రాలూ బీజేపీ అమ్ములపొదిలో వున్నాయి. అన్ని అస్త్రాల్నీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగించింది బీజేపీ.
తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఓ దశలో ఒంటరి అయిపోయారు. నమ్మకున్నోళ్ళంతా పార్టీని నట్టేట్లో ముంచేసేందుకు ప్రయత్నించారు. చాలామంది పార్టీని వీడారు. మమత తరఫున గట్టిగా నిలబడే నాయకులే కరవయ్యారు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో. మరోపక్క, ఎన్నికల సమయంలోనే ఆమె కాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయానికి కారణం బీజేపీయేనన్న ఆరోపణలూ లేకపోలేదు. గాయం బాధిస్తున్నా, చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వచ్చినా, అలాగే ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘చీరకట్టుకుంటే సరిగ్గా కాలి దెబ్బ కనిపించదేమో.. ఆ బ్యాండేజ్ కనిపించాలంటే, షార్ట్ నిక్కర్ వేసుకుంటే మంచిది..’ అంటూ అత్యంత అసభ్యకరంగా బీజేపీ నేతలు సెటైర్లు వేశారు మమతా బెనర్జీ. ఎవరెంతలా ఆమెను వేధించినా, దెబ్బతీయాలని చూసినా, పశ్చిమబెంగాల్ ప్రజలు మాత్రం, తమ దీదీకి అండగా నిలిచారు. అదే ఇంకోసారి ఆమెను అధికార పీఠమెక్కేలా చేసింది.
అన్నిటికీ మించి, గెలిచే అవకాశం ఏమాత్రం లేదని తెలిసీ, డైనమిక్ నిర్ణయం తీసుకున్నారు మమతా బెనర్జీ.. అదే నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలనుకోవడం. నందిగ్రామ్ వేదికగా అత్యంత భయానకమైన రాజకీయాలు నడిచాయి. ఫలితంగా ఓట్ల లెక్కింపు రోజున రౌండు రౌండుకీ నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. ఓ రౌండులో సువేందు అధికారి (ఒకప్పుడు మమతకి అత్యంత నమ్మకస్తుడైన తృణమూల్ నేత.. ఎన్నికల సమయంలో బీజేపీలోకి దూకేశారు), ఇంకో రౌండులో మమత ఆధిక్యం చూపారు. చివరి రౌండు వచ్చేసరికి ఏమవుతుందో తెలియక తృణమూల్
28985 610685An fascinating discussion is worth comment. I believe that you ought to write regarding this subject, it may well not be a taboo topic but generally persons are too few to chat on such topics. To yet another location. Cheers 21197
283876 800655You ought to join in a contest for starters with the highest quality blogs online. I will recommend this page! 115825
283153 850152Its really a cool and beneficial piece of information. Im glad which you basically shared this useful info with us. Please stay us informed like this. Thank you for sharing. 164980
842056 508932Hello there, just became alert to your blog by means of Google, and identified that its actually informative. Im going to watch out for brussels. I will appreciate should you continue this in future. Several folks is going to be benefited from your writing. Cheers! 200332