సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో మొదలైన విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడని తాజాగా దానికి సంబందించిన ఓ లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకోంది. ఐతే మహేష్ నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ అయన నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా .. లేటెస్ట్ గా మహర్షి సినిమా చేసిన వంశీ పైడిపల్లితోనట !!
భరత్ అనే నేను సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ మహర్షి సినిమా విషయంలో మాత్రం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. ఈ సినిమా సంచలన విజయం అందుకుందంటూ నిర్మాతలు ఊదరగొట్టారు కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. మహేష్ ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి బిజినెస్ బాగా జరిగినప్పటికీ అది ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. ఇలాంటి సినిమా ఇచ్సిన దర్శకుడితో మళ్ళీ మహేష్ సినిమా చేస్తాననడం అయన అభిమానులకు షాక్ ఇస్తుంది.
ఒక్కసారి మహేష్ తనతో సినిమా చేసిన దర్శకుడు నచ్చాడంటే మరో సినిమా ఛాన్స్ ఇవ్వడం కామన్ విషయమే. ఇప్పటికే ఈ కోవలో అతడు తరువాత త్రివిక్రమ్ తో ఖలేజా చేసాడు. సీతమ్మ వాకిట్లో తరువాత శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం చేసాడు. అలాగే శ్రీను వైట్ల తో దూకుడు అంటూ హిట్ కొట్టాకా ఆగడు ఛాన్స్ ఇచ్చాడు. ఒక్కడు అంటూ కెరీర్ బెస్ట్ సినిమా ఇచ్చిన గుణ శేఖర్ తో అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు. శ్రీమంతుడు సక్సెస్ తరువాత వెంటనే కొరటాల శివతో భరత్ అనే నేను ఛాన్స్ ఇచ్చాడు . సో ఇప్పుడు ఇదే కోవలో వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడన్నమాట. ఇప్పటికే ఈ దర్శకుడు మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యాడట. మరి ఈ సినిమాతో అయినా మహేష్ కి మంచి హిట్టిస్తాడేమో చూడాలి.
123886 274933hello!,I like your writing so so much! 711369
353088 794560Numerous thanks for this specific information I was basically browsing all Search engines to discover it! 752889
234952 837760Thanks for the info provided! I was researching for this write-up for a long time, but I was not able to see a dependable source. 834541
184239 907790Hello there, just became alert to your blog by way of Google, and identified that its actually informative. Im going to watch out for brussels. I will appreciate in the event you continue this in future. Numerous individuals is going to be benefited from your writing. Cheers! 237906