Switch to English

మోదీని ఓడించడమే బాబు టార్గెట్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ట్రెండ్ ను బట్టి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే చంద్రబాబు డీలా పడిపోవడం, ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండా తదుపరి రోజు మీడియాతో మాట్లాడటం, అప్పుడు కూడా గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేనట్టుగా వ్యవహరించడం.. ఇవన్నీ చూసి టీడీపీ ఓటమికి సిద్ధమైపోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని, ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని, ఏ గుర్తుకు ఓటేసినా అది ఫ్యాన్ కే పడుతోందంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. దీనిపై తాము జాతీయ స్థాయిలో పోరాడతామని స్పష్టంచేశారు. అనంతరం రెండు రోజులపాటు హస్తినలో మకాం వేసి తన మిత్రపక్షాల నేతలతో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం పేరుతో సమావేశం ఏర్పాటు చేసి, అందరితో కలిసి ఈవీఎంలపై పోరు ఉధృతం చేశారు. బ్యాలెట్ విధానమే మంచిదని, ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన తారాస్థాయికి చేరింది. నిజంగానే తాము ఓడిపోతున్నామా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ అధినేత ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మథనపడ్డారు. మరోవైపు వైఎస్సార్ సీపీ కూడా బాబుపై విమర్శలు మొదలుపెట్టింది. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో టీడీపీ అధినేత ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. సరిగ్గా ఇదే సమయంలో నటుడు శివాజీ ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ గెలుపు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రజలంతా పూర్తి ఏకపక్షంగా ఓట్లేశారని, అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనవసరంగా ఆందోళన చెంది, బీపీ పెంచుకోవద్దని పేర్కొన్నారు. టీడీపీ నేతలు కూడా బాబు వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

అయితే, చంద్రబాబు తాజా చర్యల వెనుక పెద్ద స్కెచ్చే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. ఏం చేసినా అందులో ఏదో కీలక అంశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఫలితాల విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఆయన చక్కని ప్లాన్ వేసుకుని, అందుకు తగ్గట్టుగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఆయన లక్ష్యం.. వైఎస్సార్ సీపీని ఓడించి అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఈ విషయంలో తేడా కొట్టిందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో బాబు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక తదుపరి తన లక్ష్యం.. ప్రధాని మోదీ. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ స్థాయిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానీయకుండా చేయడమే ధ్యేయంగా చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు అర్థమవుతోంది.

గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షంగా పోటీచేసిన చంద్రబాబు.. ఏడాది క్రితం బయటకు వచ్చేశారు. అప్పటినుంచి బీజేపీతోపాటు మోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా తమ వైఖరి స్పష్టంచేశారు. చంద్రబాబుకు ఎన్డీఏ తలుపులు మూసేశామని చెప్పారు. దీంతో ఎన్నికలు అయ్యాక ఆయన ఎన్డీఏ వైపు వెళ్లే అవకాశం లేనట్టే.

పైగా మోదీ, అమిత్ షాలను విపరీతంగా విమర్శించిన నేపథ్యంలో వారు మళ్లీ అధికారంలోకి వస్తే తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా ఎక్కడో ఒకచోట తాము అధికారంలో ఉంటే ఎలాంటి సమస్యలూ ఉండవన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఫలితం తేడా కొట్టినా, జాతీయ స్థాయిలో తన కనుసన్నల్లోని సర్కారు ఉండాలని బాబు అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవీఎంల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజల్ని బీజేపీని వ్యతిరేకించేటట్టు చేయాలన్నది ఆయన ప్రణాళిక అని పేర్కొంటున్నారు. మరి ఈ వ్యూహం ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...