Switch to English

విశాఖలో ‘వైసీపీ డీల్స్‌’.. నిజమేనని తేలిపోయిందిగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ఎంపిక చేయడం వెనుక ‘దోపిడీ’ లక్ష్యం వుందంటూ విపక్షాలు విమర్శిస్తున్న వేళ, అధికార వైసీపీ ఎదురుదాడికి దిగుతుండడాన్ని చూస్తున్నాం. ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో, కొన్ని ముఠాలు ప్రవేశించి.. అక్కడి ప్రశాంతతను దెబ్బకొగుతున్నాయనీ, ఈ ముఠాల వెనుక అధికార పార్టీ హస్తం వుందనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ‘ఇది విశాఖ ఇమేజ్‌ని దెబ్బతీసే కుట్ర..’ అంటూ ఎదురుదాడికి దిగుతూ, తమ మీద విపక్షాలు బురదజల్లుతున్నాయని అధికార పార్టీ చెప్పుకుంటోంది. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో విపక్షాల ఆరోపణలే నిజమని తేలిపోతోంది.

తాజాగా వైసీపీ నుంచి ఆ పార్టీ నేత కొయ్య ప్రసాదరెడ్డి సస్పెన్షన్‌కి గురయ్యారు. కొయ్య ప్రసాదరెడ్డి, గతంలో వైసీపీ తరఫున చాలా యాక్టివ్‌గా పనిచేశారు. పార్టీ పెద్దలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ హయాంలో భూ కుంభకోణాలపై కొయ్య ప్రసాదరెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. చిత్రంగా ఆ కొయ్య ప్రసాదరెడ్డినే ఇప్పుడు వైసీపీ సస్పెండ్‌ చేసింది. అదీ, భూ కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.

పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి పేరు వాడుకుని దందాలు నిర్వహిస్తున్నారన్నది కొయ్య ప్రసాదరెడ్డిపై ఆరోపణ. నిజానికి, సస్పెండ్‌ చేయాల్సింది కొయ్య ప్రసాదరెడ్డిని కాదు.. విజయసాయిరెడ్డిని.. అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ‘విశాఖలో అధికార పార్టీ ఆగడాలకు ఇదే నిదర్శనం. పెద్ద చేపని రక్షించేందుకు.. చిన్న చేపని ఇరికించేశారు..’ అంటూ విశాఖ జిల్లాలో జోరుగా సాగుతోంది.

2019 ఎన్నిలకంటే ముందరే విశాఖలో కొన్ని ముఠాలు మకాం పెట్టాయనీ, అక్కడ విలువైన భూముల్ని కొల్లగొట్టేశాయనీ, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెనుక అధికార పార్టీ పెద్దల ఆలోచనలు వేరేలా వున్నాయని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోపాటు, ఇతర విపక్షాలూ ఆరోపిస్తున్న విషయం విదితమే.

ఏదిఏమైనా, తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు, హడావిడిగా చర్యలు తీసేసుకుంటున్నట్లు కన్పిస్తే సరిపోదు.. చర్యలు చిత్తశుద్ధితో కూడుకున్నవై వుండాలి. రెండేళ్ళుగా విశాఖలో జరిగిన భూముల కొనుగోళ్ళ లెక్కలు చిత్తశుద్ధితో వెలికి తీస్తే.. విశాఖలో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిపోతుందన్నది సగటు విశాఖ వాసుల మనోగతం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...