హీరోల కెరీర్ టైం స్పామ్ కంటే హీరోయిన్ల స్పామ్ తక్కువ ఉంటుందనే విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో హీరోయిన్స్ నాలుగు అయిదు సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా ఉండటం గగనం అయ్యింది. అలాంటిది పదేళ్లకు పైగా కాజల్ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. కాని అమ్మడికి లక్ కలిసి రాకపోవడంతో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. దాంతో అవకాశాలు తగ్గాయి.
ఇండియన్ 2 చిత్రంతో పాటు ఇటీవలే తేజ దర్శకత్వంలో అలిమేలుమంగ వెంకటరమణ చిత్రంలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇండియన్ 2 సినిమా యాక్సిడెంట్ కారణంగా ఆగిపోగా.. తేజ దర్శకత్వంలో చేయాల్సిన మూవీలోంచి కూడా కాజల్‌ను తప్పించినట్లుగా సమాచారం అందుతోంది. గోపీచంద్‌కు జోడీగా కాజల్ బాగానే ఉంటుంది కాని ఆమె ఏకంగా రెండు కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న కారణంగా ఆమెను తొలగించినట్లుగా సమాచారం అందుతోంది.
హీరో స్థాయిలో పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలు కాజల్‌ను పక్కకు పెట్టాల్సిందే అంటూ తేజకు అల్టీమేటం జారి చేశారట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాజల్‌ను తేజ పక్కకు పెట్టాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కాజల్‌ను తప్పించిన చిత్ర యూనిట్ సభ్యులు రెండు కోట్లు ఇచ్చి కీర్తి సురేష్‌ను ఈ చిత్రంలో నటింపజేయాలని భావిస్తున్నారు. మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ తెలుగులో చాలా ఫేమస్ అయ్యింది. అందుకే రెండు కోట్లు ఇచ్చి ఆమెను నటింపజేయాలని తేజ కూడా భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
35739 613758When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 946232
182897 432481Spot on with this write-up, I truly think this website needs considerably more consideration. Ill probably be again to read significantly a lot more, thanks for that info. 106539