Switch to English

కేసీఆర్‌ నేషనల్‌ పాలిటిక్స్‌.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

‘దేశంలో హెల్త్‌ ఎమర్జన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఎమర్జన్సీ కూడా ముందు ముందు రావొచ్చు. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్‌ మనీ అనేది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది.. కేంద్రమే, రాష్ట్రాల్ని ఆదుకోవాలి. నిధులు తెచ్చుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలి..’ అంటూ కరోనా తొలి నాళ్ళలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే, కేసీఆర్‌ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొందరు వెటకారం చేశారు. కానీ, కేసీఆర్‌ చెప్పిందే జరిగి వుంటే.. దేశంలో పరిస్థితులు ఇప్పుడు ఇంకాస్త బెటర్‌గా వుండేవేమో.. అంటారు చాలామంది.

నిజానికి, కేసీఆర్‌.. కేంద్రాన్ని ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదు. కేంద్రాన్ని ప్రశంసిస్తారు, కేంద్రాన్ని నిలదీస్తారు.. సందర్భాన్ని బట్టి కేసీఆర్‌ వ్యూహాలుంటాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన మాటలు ఆంధ్రోళ్ళకి కొంత బాధించి వుండొచ్చుగాక. కానీ, ఇప్పుడు కేసీఆర్‌ వ్యాఖ్యలు ఆంధ్రోళ్ళని కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఆయన్ని ‘జాతీయ నాయకుడు’ అనే కోణంలో తెలుగునాట చాలామంది చూస్తున్నారు. సరే, కేసీఆర్‌.. ఏ పూట మాట ఎలా మార్చుతారో తెలియదు.. అన్న వాదననీ కొట్టి పారేయలేమనుకోండి.. అది వేరే సంగతి. మరోపక్క, కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

‘దేశ ప్రధాని అయ్యే అర్హతలు కేసీఆర్‌కి వున్నాయి..’ అంటూ గులాబీ శ్రేణులు 2019 ఎన్నికలకు ముందు నానా హంగామా చేయడం చూశాం. ఆ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు రాలేదుగానీ, వచ్చి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది. ఇక, ఇప్పుడు కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టడమే కాదు, కొత్త రాజకీయ శక్తిగా అవతరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలో కేసీఆర్‌, జాతీయ నాయకులతో సమావేశమవుతారట. దేశంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రకటించబోతున్నారట. అంతే కాదు, ‘నయా భారత్‌’ నినాదంతో ఓ కొత్త జాతీయ పార్టీని కూడా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ ప్రకటించడం జరగకపోవచ్చుగానీ.. కొత్త జాతీయ కూటమి అయితే ఆయన ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయి. అయితే, ఆయనతో ఎవరు కలిసొస్తారన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...