Shiva RajKumar : కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను శివ రాజ్ కుమార్ తనదైన శైలిలో విభిన్నంగా ప్రచారం చేస్తూ వస్తున్నాడు. తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
మహేష్ బాబు గురించి అడిగిన ప్రశ్నకు శివ రాజ్ కుమార్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా శివ రాజ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. అభిమానులు చిరంజీవి తో ఉన్న అనుబంధం గురించి స్పందించాలని కోరడంతో శివ రాజ్ కుమార్ ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ లో శివ రాజ్ కుమార్ స్పందిస్తూ… లెజెంట్ ఎప్పటికీ లెజెండ్ గానే ఉంటారు. ఆయన్ను నేను కలిసిన సమయంలో మాట్లాడిన సమయంలో చాలా నేర్చుకున్నాను. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. ఆయన నా పట్ల కనబర్చిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనపై నాకు ఎప్పటికి కూడా గౌరవం ఉంటుందని శివ రాజ్ కుమార్ ట్వీట్ చేశాడు.
A legend and will forever be a legend. One of the most gifted humans I’ve had the chance to interact and learn from. Just love and respect towards @KChiruTweets Garu #AskNimmaShivanna #Ghost #GhostOct19 https://t.co/aHl0a3Qr6l
— DrShivaRajkumar (@NimmaShivanna) September 30, 2023