ఈమద్య కాలంలో వచ్చిన బయోపిక్ ల్లో ఎక్కువ శాతం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఒకటి రెండు సినిమాలు మినహా బయోపిక్ లు ప్రేక్షకులను అలరించాయి. అందుకే వరుగా బయోపిక్ లను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తిని కనబర్చుతున్నారు. మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను ప్రస్తుతం విజయ్ రూపొందిస్తున్నాడు.
కంగనా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడంతో సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఈ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ప్రముఖ స్టార్స్‌ను ఈ చిత్రంలో నటింపజేయడం వల్ల ఎక్కువ పారితోషికం అవుతుందని సమాచారం అందుతోంది.
బయోపిక్కు వంద కోట్ల బడ్జెట్ అంటే రికవరీ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయోపిక్ ఎంత కమర్షియల్‌గా ఉన్నా కూడా ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోవచ్చు అంటూ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగు హిందీల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్న మేకర్స్ ఖచ్చితంగా 150 కోట్ల వసూళ్లు సాధ్యం అంటూ నమ్మకంగా ఉన్నారు. ఇక ఇతర రైట్స్ ద్వారా మరో 50 కోట్లు వస్తాయని మొత్తంగా 200 కోట్ల బిజినెస్ అవుతుందని వారు నమ్మకంగా ఉన్నారు.
సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమ్మ జీవితంలోని పలు కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆమె గురించి తెలియని పలు విషయాలు కూడా ఈ సినిమాతో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
177117 917372Very usefull blog. i will follow this weblog. maintain up the excellent function. 349133
21376 176113hi and thanks regarding the particular post ive really been searching regarding this kind of info online for sum time these days hence thanks a great deal 555933
222958 842552I gotta bookmark this internet site it seems extremely beneficial invaluable 949915
956011 878430dog grooming could be the specialty of my sister, she really loves grooming every dog in our house 757764
734523 370429Blogs ou should be reading […]Here is a great Blog You may Locate Intriguing that we Encourage You[…] 859581