దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. యూపీఎస్సీ ద్వారా ఏడాదికి రెండుసార్లు ఎన్డిఏ అండ్ ఎన్ఏ పరీక్షను నిర్వహిస్తోంది. డిఫెన్స్ అకాడమీ కి ఎంపికైన వారు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బీటెక్.బీఎస్సి, బీఏ కోర్సులు ఉచితంగా చదువుకుంటూ రక్షణలో బేసిక్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. వసతి, భోజనం, దుస్తులు అన్ని ఫ్రీగా ఇస్తోంది. నేవల్ అకాడమీకి సెలెక్ట్ అయిన వారు కేరళలోని ఎజమాళలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా చదువు పూర్తి చేస్తున్న వారికి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. శిక్షణ సమయంలో రూ. 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వర్తిస్తారు. అందరికీ లెవెల్ -10 స్కేల్ వేతనాలు చెల్లిస్తారు. అంటే వీరు మొదటి నెల నుంచి రూ. లక్షకు పైగా జీతం తో పాటు ఇతర ఇంటెన్సివ్స్ అందుకుంటారు.
ఉద్యోగ వివరాలు:
ఖాళీలు: 404, వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 (ఆర్మీ 208 (10 మహిళలకు), నేవీ 42 (6 మహిళలకు), ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 120. ఇందులో 92 ఫ్లయింగ్ (2 మహిళలకు), గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ 18 (2 మహిళలకు), గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 10 (2 మహిళలకు) ఉన్నాయి. నేవల్ అకాడమీలో 34 (5 మహిళలకు) ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: ఆర్మీ వింగ్ కి ఏదైనా గ్రూప్ లో ఇంటర్ పాసై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ ( ఎన్డీఏ) 10+2 కాడేట్ ఎంట్రీ స్కీమ్ ( ఇండియన్ నేవల్ అకాడమీ) లకు ఎంపీసీ గ్రూప్ తో ఇంటర్ పాసై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనవరి 2, 2006 నుంచి జనవరి 1, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఆన్ లైన్ అప్లికేషన్స్: జూన్ 4 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
పరీక్ష ఎప్పుడు?: సెప్టెంబర్ 1.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడంటే? : అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
మరిన్ని వివరాలను http://upsc.gov.in వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు.