పంచాంగం
తేదీ 10- 06-2024, సోమవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు
తిథి: శుక్ల చవితి సా 4.33 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: పుష్యమి రాత్రి 10. 38 వరకు, తదుపరి ఆశ్లేష
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, సా.2.46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: లేవు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సమస్యలను తల్లితో పంచుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి: ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. ఆదాయ వ్యయాలను సమన్వయం చేసుకోవాలి. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
మిథున రాశి: ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించేటప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి: గిట్టని వారు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన రుణాలు కొంతమేరకు తీర్చగలుగుతారు. వ్యాపారంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.
సింహ రాశి: సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. అధిక ఖర్చుల వల్ల ఒత్తిడి కి గురవుతారు. పిల్లల భవిష్యత్తు గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల చిన్నచిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి.
కన్యా రాశి: ముఖ్యమైన పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్నేహితుడి అనారోగ్యంతో కలత చెందుతారు. పెద్దల ఆశీస్సులతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో మార్పులు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి: ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. కుటుంబంలోని అవివాహితులకు వివాహం ఖరారు అవుతుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులకు వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడం మంచిది.
వృశ్చిక రాశి: వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితుని కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు.
ధనస్సు రాశి: కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు చేతికందుతాయి.
మకర రాశి: కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. అనుకోకుండా పనిలో జరిగే పొరపాట్లు నష్టానికి దారి తీయచ్చు. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు.
కుంభరాశి: వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేముందు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.