Japan: నేటి ఆధునిక ప్రపంచంలో ఒకొక్కరిదీ ఒక్కో తీరు.. ఒకొక్క అభిరుచి. కొత్త ఫ్యాషన్లు, టెక్నాలజీ, కళ.. ఇలా ఏదైనా అందులో భిన్నత్వం చూపిస్తూ అందరిలో స్పెషల్ గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. జపాన్ (Japan) కు చెందిన ఓటోరు ఉయోదాది కూడా ఇందుకు భిన్నం కాదు.. కానీ విచిత్రమైన ఆలోచనతో అందరికంటే భిన్నంగా కనిపించాలనుకున్నాడు. తోడేలు (Wolf) గా మారిపోవాలనే ఆలోచనే ఆ విభిన్నమైన ఆలోచన. ఇందుకు ఏకంగా రూ.18లక్షలు ఖర్చు చేసి తోడేలుగా మారిపోయాడు. తన కోరిక తీరడంతో సంతోషిస్తున్నాడు కూడా.
సినిమాలు, క్యాస్ట్యూమ్స్ రూపొందించే ‘జెప్పెట్’ అనే సంస్థ సాయంతో ఇలా తోడేలులా మారాడు. సదరు సంస్థ ఈ తోడేలు దుస్తులను తయారు చేసింది. తోచినప్పుడల్లా ఈ డ్రెస్ ధరించి అచ్చం తోడేలులా మారిపోతున్నాడు. అలా మారుతున్నప్పుడల్లా తనకు విశ్రాంతి దొరుకుతుందని, సమస్యలు మర్చిపోతున్నానని, బాధలు గుర్తు రావట్లేదని అంటున్నాడు. ప్రస్తుతం ఓటోరు ఉయోదాది తీరు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. తోడేలు లుక్ లో ఓటోరు మాత్రం అచ్చం తోడేలులానే అనిపిస్తున్నాడు.