ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ మనుగడ సాధించడం అనేది సాధ్యమయ్యే పని కాదు.! 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసిన జనసేన పార్టీ, ఒక్కటంటే ఒక్క సీటునీ గెలవలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకుంది. టీడీపీ కూడా తెలంగాణలో వుందో లేదో తెలియని పరిస్థితి. పార్టీ నడపలేక, వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసెయ్యడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తామూ పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య, ఆయా నియోజకవర్గాల పేర్లను జనసేన తెలంగాణ విభాగం ప్రకటించింది. ఆ లిస్టులో గ్రేటర్ హైద్రాబాద్ నుంచి పలు నియోజకవర్గాలతోపాటు, జనసేన బలంగా వున్న మరికొన్ని నియోజకవర్గాలూ వున్నాయి. మొత్తంగా 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది.
అయితే, ఎన్నికల్లో పొత్తులను బట్టి నియోజకవర్గాల సంఖ్యలో మార్పు వుంటుందని జనసేన పేర్కొంది. అంటే, టీడీపీ – జనసేన కలిసి పోటీ చేసినా, టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేసినా.. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్యలో మార్పు వుండొచ్చు. వాస్తవానికి తెలంగాణలో శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో జనసేన పార్టీ యాక్టివ్గా వుంది. ఖమ్మం జిల్లా సహా, తెలంగాణలోని పలు జిల్లాల్లో చాలా యాక్టివ్గా వుంటోంది జనసేన.
ఈ నేపథ్యంలోనే అత్యంత వ్యూహాత్మకంగా జనసేన పార్టీ తెలంగాణలో తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల వివరాల్ని వెల్లడించిందని భావించాల్సి వుంటంది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే సర్వసన్నద్ధమవుతున్నాయి.
ముందుగా భారత్ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ బయటకు వచ్చింది. లిస్టులో చోటున్నా, కొందరు అభ్యర్థులు (ప్రజా ప్రతినిథులు) భారత్ రాష్ట్ర సమితిని వీడుతున్నారు కూడా.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల వివరాలు.@JanaSenaParty @PawanKalyan#JanaSenaTelangana #VarahiVijayaYatra pic.twitter.com/HUq9cRDdxU
— TeluguBulletin.com (@TeluguBulletin) October 2, 2023
Nicee blog! Is your theme custom made oor did yoou
downlod itt frlm somewhere? A design lioke youhrs witfh a feew simple twseks wiuld resally make myy blog
jump out. Please lett mee knlw wherde youu got yolur design. Cheers