సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై మౌనం దాల్చారు. మౌనం అంటే, దానర్థం రాజకీయాలపై వైరాగ్యమని కాదు. నిజానికి ఇది అత్యంత కీలకమైన సమయం జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి. తాజా ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత పార్టీని బూత్ లెవల్లో పటిష్టం చేయాల్సి వుంది. అలా పటిష్టం చేయడానికి అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి. ముందుగా పార్టీలో కోవర్టులెవరో గుర్తించాలి. లేకపోతే, పార్టీని ఎంత పటిష్టం చేసినా ఉపయోగముండదు. పార్టీ తరఫున అన్ని రకాల ‘లబ్ది’ పొందిన నేతలు, చివరి నిమిషంలో పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం జనసేన పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో చాలా పెద్ద మైనస్‌గా మారింది.
సినీ నటుడిగా జనసేనానికి వున్న ఫాలోయింగ్, దాంతోపాటుగా అప్పట్లో తెలుగుదేశం పార్టీకీ, బీజేపీకీ, జనసేనకీ వున్న స్నేహం నేపథ్యంలో ‘ఏవో ఆశించి’ జనసేనలోకి వచ్చిన నేతలు, జనసేనానితో సఖ్యతగా వుండి, తమ ‘పనులు’ చక్కబెట్టుకుని, చివరికి హ్యాండిచ్చారు. ఇకపై అలాంటి తప్పిదాలు జరగకూడదనే కృతనిశ్చయంతో వున్నారట పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారి వివరాలకు సంబంధించిన నివేదికల్ని బూత్ లెవల్ నుంచి తెప్పించుకుంటున్న జనసేనాని, వాటన్నిటినీ విశ్లేషించే పనిలో బిజీగా వున్నారు.
ఏయే నియోజకవర్గాల్లో ఎవరెంత చిత్తశుద్ధితో పనిచేశారన్నదానిపై ప్రధానంగా జనసేన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ‘పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌తో గెలిచేస్తాం..’ అనే నిర్లక్ష్యంతో వ్యవహరించినవారికి జనసేనాని త్వరలో పెద్ద షాక్ ఇవ్వబోతున్నారట. పార్టీ కోసం ఇప్పటికీ జనంలోనే వుంటున్నవారిని ప్రత్యేకంగా గౌరవించాలన్నది జనసేనాని ఆలోచనగా కన్పిస్తోంది. తన అభిమానుల్లోనూ హార్డ్ కోర్ టీమ్ వుందని పవన్‌కళ్యాణ్‌కి బాగా తెలుసు. ఆ టీమ్‌కి ప్రత్యేక పొలిటికల్ శిక్షణ ఇప్పిస్తే, ఆ టీమ్ అద్భుతాలే సృష్టిస్తుందని పవన్ భావిస్తున్నారు.
ఇందుకోసం జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నేతృత్వంలో త్వరలో శిక్షణా తరగతులు జరగనున్నాయట. అదే సమయంలో రాజకీయ అనుభవం వున్న సీనియర్ నేతలతో, రాజకీయ వ్యూహాలకు సంబంధించి శిక్షణ ఇప్పించాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి ఎలాగూ కొంత సమయం ఇవ్వాలి గనుక, ఇప్పటికిప్పుడు తాను ప్రెస్మీట్లు పెట్టి, జనంలో తిరిగి హంగామా చేయాల్సిన అవసరం లేదనే అంచనాకి వచ్చిన పవన్, పార్టీ పరమైన అంతర్గత కార్యక్రమాలపై, ప్రక్షాళణ, పునర్మాణంపై దృష్టి పెట్టబోతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ‘గెలుపోటముల్ని సమానంగా తీసుకోవడమే జనసేన లక్ష్యం. ఓటమికి దిగులు చెందం, గెలుపుకి పొంగిపోం’ అని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు.
618266 55489I believe other site proprietors should take this site as an model, quite clean and wonderful user friendly style and design, as well as the content material. Youre an expert in this topic! 896421
742682 360267Its superb as your other posts : D, regards for posting . 583656
35051 642241Effectively worded post will likely be sharing this with my readers this evening 550182