మహిళ కంట కన్నీరు.. ఏ ఇంటికీ మంచిది కాదు.. అలాంటది.. అమరావతి ప్రాంతంలో మహిళలు కంట కన్నీరు మాత్రమే కాదు.. రక్తం కూడా కారుతోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. ఇప్పుడు తమకు న్యాయం కావాలంటూ ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమంలో మహిళలే ముందడుగు వేశారు. అమరావతిని రక్షించాలంటూ బెజవాడ కనకదుర్గమ్మకు మొరపెట్టుకునేందుకు వెళుతున్న మహిళా రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
మందడం గ్రామంలో అయితే, గ్రామ దేవత పోలేరమ్మకు నైవేద్యం పెట్టుకుందామని భావించిన మహిళా రైతుల్ని పోలీసులు అడ్డగించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ‘మేం హిందువులమనే కదా మీకు అంత ఆగ్రహం… మీరు తిరుపతి వెంకటేశ్వరస్వామిని మొక్కుకుని పాదయాత్ర చేశారు.. మేం, కనకదుర్గమ్మని మొక్కుకునేందుకు పాదయాత్రగా వెళ్ళకూడదా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మీడియా సాక్షిగా అమరావతి మహిళలు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి నుంచి బెజవాడ కననకదుర్గమ్మ దర్శనం కోసం వెళుతున్న మహిళల్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ముళ్ళకంచెలు వేస్తున్నారు పోలీసులు. దొరికినవారిని దొరికినట్లే పోలీసులు చితకబాదుతున్నారంటూ రక్తమోడుతున్న శరీరంతో మహిళలు వాపోతుండడం గమనార్హం.
‘మీ క్రిస్మస్ పండక్కి ఊరూరా సెలబ్రేషన్స్ చేశారు.. ర్యాలీలు జరిపారు.. మేం హిందువులం కాబట్టి మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నారా.?’ అని కొందరు మహిళా రైతులు ప్రభుత్వాన్ని ప్రశిస్తుండడం గమనార్హం. ‘అమరావతిలో హిందుత్వంపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది’ అంటూ మహిళా రైతులు ఆరోపిస్తుండడంతో.. అమరావతి వివాదం కాస్తా మతం రంగు పులుముకుంటుండడం గమనార్హం.
421926 284121There is visibly a bunch to know about this. I believe you produced various very good points in capabilities also. 74628
43100 470421I like this website extremely significantly, Its a quite nice position to read and receive information . 405964
949746 472009I really like this info presented and possesses given me some type of resolve forpersistance to succeed i truly enjoy seeing, so sustain the exceptional work. 776709
697082 502354Just wanna input on couple of general points, The website style is perfect, the articles is extremely excellent : D. 720172
764446 184657Enjoyed seeking at this, quite good stuff, thanks . 940313