ఈమద్య కాలంలో జబర్దస్త్ కమెడియన్స్ గురించి మీడియాలో ప్రముఖంగా వింటూనే ఉన్నాం. ఆ కమెడియన్ సినిమా చేస్తున్నాడు.. ఈ కమెడియన్ పారితోషికం అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. కాని మొదటి సారి జబర్దస్త్ కమెడియన్స్ వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది టీంలో కనిపించే దొరబాబు మరియు ఇతర టీంలలో కనిపించే పరదేశిలు ఇద్దరు కూడా వైజాగ్‌లోని ఒక హోటల్లో అమ్మాయిలతో పట్టుబడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వైజాగ్‌లోని మాధవధారలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందిందట. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. వ్యభిచారం జరుగుతున్న ప్లాట్ వద్దకు వెళ్లగా అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇంకా వ్యభిచారం నిర్వహిస్తున్న వారితో పాటు ఈ జబర్దస్త్ కమెడియన్స్ కనిపించినట్లుగా తెలుస్తోంది.
హైపర్ ఆది స్కిట్లో దొరబాబుపై ఎక్కువ పంచ్‌లు ఉంటాయి. దొరబాబు బ్లూ ఫిల్మ్‌లో నటించేవాడు అంటూ ఆది స్కిట్ల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇలా దొరకడంతో ఆయన జబర్దస్త్ కెరీర్ ఖతం అయినట్లే. ఆది టీంలో మళ్లీ దొరబాబు కనిపించక పోవచ్చు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. సినిమాల్లో కూడా ఈయనకు ఆఫర్లు రాకపోవచ్చు.
ఫ్యామిలీ జీవితంలో కూడా అనేక ఒడిదొడుకులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇక పరదేశీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి వీరిద్దరు కూడా మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
843178 760867I enjoy this website, will undoubtedly arrive back. Make confident you carry on writing high quality posts. 948414