ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లాలంటే తొలుత కాలినడకనే వెళ్లేవారు. కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. గుర్రపు బళ్లు.. మోటారు కార్లు.. రైళ్లు.. చివరకు విమానాలు, రాకెట్లు కూడా రావడంతో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంత వేగంగా ప్రయాణించగలిగితే అంత అభివృద్ది చెందినట్టు అనే భావనతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇందులో భాగంగా భూమి మీదే గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే హైపర్ లూప్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణ రోడ్లు లేదా రైలు పట్టాలపై ఇది సాధ్యం కాదు. అందుకే లూప్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే ఒక గొట్టంలో ప్రయాణించడం అన్నమాట. ట్యూబ్ వంటి నిర్మాణంలో క్యాప్సుల్ వంటి వాహనంలో కూర్చుని వెళ్లిపోవడమే దీని ప్రత్యేకత.
రైలైతే వేగం పెరిగేకొద్దీ పట్టాలు తప్పే ఛాన్స్ ఉంటుంది. హైపర్ లూప్ లో అలాంటి ప్రమాదం ఉండదు. ఎంత వేగంగా వెళ్లినా ఏమీ కాదు. ఎప్పటినుంచో దీనిపై జరుగుతున్న ప్రయోగాల్లో తాజాగా కీలక ముందడుగు పడింది. అమెరికాలో సోమవారం నిర్వహించి ప్రయోగంలో తొలిసారిగా ప్రయాణికులతో జరిపిన ట్రయల్ రన్ విజయవంతమైంది.
వర్జిన్ హైపర్ లూప్ అనే సంస్థ అరకిలోమీటర్ పొడవున్న హైపర్ లూప్ ట్రాక్ పై బోగీని విజయవంతగా నడిపించింది. ఆ కంపెనీకి చెందిన జోష్ గైగెల్, సారా లూచియన్ లు తొలిసారిగా హైపర్ లూప్ లో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. 172 కిలోమీట్ల వేగంతో ఇది సురక్షితంగా ప్రయాణించింది. 2030 నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సంస్థ యోచిస్తోంది. ఇది పూర్తయితే రవాణా వ్యవస్థలో మరో విప్లవం వచ్చినట్టే.
857467 863319I conceive this internet website has got some extremely outstanding info for everyone : D. 183459
757278 635308Thank you for writing this tremendous top quality write-up. The info in this material confirms my point of view and you actually laid it out properly. I could never have written an write-up this very good. 937407
382276 172513You produced some decent points there. I looked on the net to the issue and found many people go together with together along with your web site. 955235