Switch to English

‘డ్రాగన్‌’ పోటుపై మోడీ సర్కార్‌ ఏం చెబుతుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మామూలుగా మనమంతా ‘పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌’ గురించి మాట్లాడుకుంటుంటాం. మరి, చైనా ఆక్రమిత కాశ్మీర్‌ సంగతేంటి.? ఎప్పుడో దాదాపు ఐదు దశాబ్దాల క్రితం భారతదేశం నుంచి కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుంది. అదే అక్సాయ్‌ చిన్‌.. దాన్నే మనం చైనా ఆక్రమిత కాశ్మీర్‌ అని చెబుతుంటాం. ప్రస్తుత లడఖ్‌కి ఆనుకుని వుంటుందిది. గత నాలుగైదేళ్ళలో చైనా, భారత్‌ని ఆక్రమించేందుకు ఉవ్విళ్ళూరుతున్న విషయం విదితమే. బోర్డర్‌లో చైనా సైన్యం భారీ మోహరింపులకు దిగుతోంది. భారత సైన్యంతో గిల్లికజ్జాలకు దిగుతోంది.

‘సరిహద్దుల్లో చిన్నపాటి అలజడులు సర్వసాధారణమే.. ఇవి యుద్ధానికి దారి తీసేంతటి తీవ్రమైన పరిణామాలు కావు. భారత్‌తో శాంతియుతంగానే అన్ని సమస్యలూ పరిష్కరించుకుంటాం..’ అని చైనా పదే పదే చెబుతోంది. కానీ, ఇంకోపక్క భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆల్రెడీ నేపాల్‌ని తన దారికి తెచ్చుకున్న చైనా, నేపాల్‌ – భారత్‌ మధ్య సరిహద్దు వివాదాన్ని రగిల్చిన విషయం విదితమే.

తాజాగా లడక్‌ సరిహద్దుల్లో చైనా సైన్యం గొడవకు దిగుతోంది. గత కొన్నాళ్ళుగా డోక్లాం ప్రాంతంలో చైనా అత్యుత్సాహం ఎక్కువైంది. నిజానికి, అక్కడ కొంత భారత భూభాగంలో చైనా తిష్ట వేసిందన్న ప్రచారం జరుగుతోంది. ‘అబ్బే, అదేం లేదు..’ అని భారత ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క, చైనా మన దేశానికి చెందిన కొంత భూమిని ఆక్రమించుకుందంటూ జరుగుతోన్న ప్రచారానికి మరింత బలం చేకూరేలా రక్షణ రంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

చాలా ఏళ్ళ తర్వాత భారత్‌ నుంచి కొంత భూమిని చైనా ఆక్రమించుకుందంటూ జాతీయ అంతర్జాతీయ మీడియాలో కథనాల నేపథ్యంలో, నరేంద్ర మోడీ సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఇప్పటికే ఈ విషయమై చాలా సున్నితంగా నరేంద్ర మోడీ సర్కార్‌ని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో విపక్షాలు ఆచి తూచి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.

నేపాల్‌ వివాదంలోనూ భారత్‌ మెతక వైఖరి ప్రదర్శించిందనీ, ఇప్పుడు లడాఖ్‌ సరిహద్దుల్లో చైనా ‘అతి’ ఎక్కువయ్యిందంటే, తెరవెనుకాల జరగకూడనిది ఏదో జరిగిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడీ వ్యవహారాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మోడీ సర్కార మీదనే వుంది. ఎందుకంటే, ఇది 130 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...