Sreeleela : రాఘవేంద్ర రావు కొత్త పెళ్లి సందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు అమ్మాయి అయినా కూడా కన్నడంలో ఈ అమ్మడు మొదట సినిమాలు చేసింది. అక్కడ నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు వలస వచ్చింది. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా ధమాకా సినిమాతో హిట్ సొంతం చేసుకుంది.
ధమాకా తో దక్కిన విజయం కారణంగా శ్రీలీలకు ఒక్కసారిగా అరడజను సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. అందులో భగవంత్ కేసరి మినహా మరే సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. భగవంత్ కేసరి సినిమా లో శ్రీలీల హీరోయిన్ గా నటించక పోవడం వల్ల ఆ హిట్ ఆమె ఖాతాలో పడలేదు.
తాజాగా సంక్రాంతి కానుకగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది, దాంతో ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటాను అని శ్రీలీల భావించింది. కానీ మొత్తం తలకిందులు అయ్యింది.
శ్రీలీల చేసిన ప్రతి సినిమా కూడా కమర్షియల్ గా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో ఆమె భవిష్యత్తు ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతానికి కొత్త ఆఫర్లు లేవు.. ముందు ముందు అయినా ఆమెకు ఆఫర్లు దక్కేనా అనేది చూడాలి.