Venu: ప్రముఖ టాలీవుడ్ (Tollywood) హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) ఇంట్లో విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు
ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్నుమూశారు. దీంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఈ వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పలువరు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వేణుకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. నేటి మధ్యాహ్నం ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.