Switch to English

మునిగిపోతే దేవుడే దిక్కా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రస్తుత ప్రపంచం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎనలేని అభివృద్ది కనిపిస్తోంది. గుండె తీసి కొత్త గుండె పెట్టేస్తున్నారు. సృష్టికే ప్రతిసృష్టి చేస్తున్నారు. చంద్రుడిని చుట్టి వచ్చేయడమే కాదు.. అంతరిక్షంలోకి సైతం అవలీలగా వెళ్లి వచ్చేస్తున్నారు. మన కంటికి కనిపించని నింగిని జయించిన మానవుడు.. అందరికీ కనిపించే నేలను, నీటిని మాత్రం జయించలేకపోతున్నాడు. భూకంపాలను నిరోధించడంలోనూ, వరదల వంటి విపత్తులను నియంత్రించలేకపోవడంలోనూ అంతగా విజయం సాధించలేకపోతున్నాడు.

ప్రకృతి విపత్తుల ముందు మానవుడి శక్తి తక్కువే అయినా.. చిన్న చిన్న విషయాల్లో కూడా అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. పాపికొండల విహారయాత్రకు వెళ్లిన లాంచీ మునిగిపోతే దానిని గుర్తించడానికే రెండు రోజుల సమయం పట్టింది. దాదాపు 300 అడుగుల లోతులో ఉన్న ఆ లాంచీని పైకి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక బోరు బావిలో ఏ చిన్నారైనా పొరపాటున పడిపోతే వారు ప్రాణాలతో పైకి వస్తే అదృష్టంగానే భావించాలి.

Also Read: గోదావరిలో బోటు మునక: ఈ గులాబీ రాజకీయమేంటి.?

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎలాంటి పురోగతి ఉండటంలేదు. ఆ మధ్యన మలేసియాకు చెందిన విమానం సముద్రంలో కూలిపోయింది. దాని జాడ కనుక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. పలు దేశాలు సమిష్టిగా గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ఇక మన వైమానిక దళానికి చెందిన విమానం అండమాన్ వెళుతూ బంగాళాఖాతంలో కూలిపోయింది. అది ఎక్కడ పడిందో ఇప్పటికీ తెలియదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంతో రెండతస్తుల లాంచీ మునిగిపోయింది.

ఈ ఘటనలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. వారిలో కొంతమంది మృతదేహాలు ఇంకా దొరకలేదు. లాంచీ మునిగిపోయిన ప్రదేశం కచ్చితంగా తెలిసినా, అది ఎంతో లోతులో ఉందో తెలుసుకోవడానికే రెండు రోజులు పట్టిందంటే టెక్నాలజీపరంగా మనం ఎంత వెనక ఉన్నామో అర్థమవుతోంది. ఇక ఆ లాంచీని పైకి తీసుకురావడం ఎలాగో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ది చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉండటం నిజంగా శోచనీయమే.

ప్రమాదాల్ని మనం ఊహించలేం. కానీ వాటిని నివారించడం మన చేతుల్లో పనే కదా? ప్రభుత్వం, అధికార యంత్రాంగం పక్కాగా పని చేసి ప్రజల ప్రాణాల పట్ల సరైన శ్రద్ధ వహిస్తే కచ్చులూరు వంటి ఘటనలు జరగవు కదా? మునిగిపోతే దేవుడే దిక్కు అని అనుకోకుండా మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అధికారులే దేవుళ్లు అవుతారు. ఘటన జరిగిన తర్వాత తప్పు మీదంటే మీది అని ఒకరిపై మరొకరు నెపం వేసుకోకుండా భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిలషిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....