దర్శకుడిగా అనిల్ రావిపూడి సినీ ప్రయాణం చాలా మంది కొత్తవారికి స్ఫూర్తినిచ్చేదే. ఎందుకంటే కెరీర్ మొదటి నుండి దర్శకుడిగా అనిల్ గ్రాఫ్ పైకి లేస్తూనే ఉంది. దర్శకుడిగా ఇప్పటివరకూ ఐదు సినిమాలు తెరకెక్కించాడు. ఈ ఐదు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అనిల్ లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరుతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసే అవకాశాన్ని సాధించాడు.
కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడని పేరున్న అనిల్ రావిపూడి, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన చిత్రం గాలి సంపత్. శ్రీ విష్ణు హీరోగా, రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ లో తెరకెక్కిన గాలి సంపత్ నిన్న విడుదలై యావరేజ్ రేటింగులను తెచ్చుకుంది. అయితే తొలిరోజు ఈ సినిమా కనీసం 50 లక్షల షేర్ ను తెచ్చుకోలేక చతికిలబడింది. పోటీగా వచ్చిన మిగతా రెండు సినిమాలు సూపర్ కలెక్షన్స్ ను సాధిస్తున్నాయి. డిజాస్టర్ వైపు గాలి సంపత్ వెళుతోంది. దీంతో అనిల్ రావిపూడి కెరీర్ లో తొలిసారి ప్లాప్ ను అందుకున్నట్లే.
447182 743943Attractive section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire really enjoyed account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 218372