Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: సాయిమాధవ్ బుర్రా – ఒక్కసారి పవన్ కళ్యాణ్ మూవీకి పనిచేస్తే, ప్రతి సినిమాకి చేయాలనిపిస్తుంది.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘మళ్లీమళ్లీ ఇదిరాని రోజు’, ‘కంచె’, ‘ఖైదీ నెం 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘మహానటి’ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించిన స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా. లాక్ డౌన్ కి ముందు ఆయన తెలుగు చిత్ర సీమలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలైన ఆర్ఆర్ఆర్ మరియు పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలకు మాటలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు చిట్ చాట్ చేసి తెలుసుకున్న పలు విశేషాలు మీకోసం..

ప్రశ్న) ప్రతి రచయిత, డైరెక్టర్ ఈ లాక్ డౌన్ టైంలో హీరోల కోసం కథలు రాస్తున్నారు. మీరు ఏ హీరో కోసమైనా కథ రాశారా?
స) నాకు ఈ హీరో కోసం, ఆ హీరో కోసం అని కథలు రాసే అలవాటు లేదు. నాకు నచ్చిన పాయింట్ తో ఓ కథ రాస్తాను. అలా ఈ లాక్ డౌన్ లో కూడా కొన్ని కథలు రాసాను. హీరోలు ఎవరనేది అనుకోలేదు.

ప్రశ్న) ఆర్ఆర్ఆర్ ఓ పాన్ ఇండియా సినిమా. అందులోనూ ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ లాంటి ఇద్దరి స్టార్ హీరోలని ఒకేసారి తెరపై చూపించడం డైరెక్టర్ కి కత్తిమీద సాము లాంటిది. అలాంటి సినిమాకి ఒక రైటర్ గా డైలాగ్స్ రాయడంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
స) ఇద్దరి పాత్రలని దర్శకుడు ఎలా అయితే బాలన్స్ చేశారో అదే విధంగా బాలన్స్ చేస్తూ రాసుకుంటూ వచ్చాను. ఇద్దరు హీరోలు ఎవరి పాత్ర ఎక్కువ ఎవరి పాత్ర తక్కువ అని కాకుండా ఇద్దరి పాత్రల నిడివి సరిసమానంగా ఉంటుంది. అలాగే ఆర్ఆర్ఆర్ అనేది నెక్స్ట్ లెవల్ సినిమా. ప్రేక్షకులు ఏ రేంజ్ అంచనాలతో వచ్చినా ఆ అంచనాలకు మించి ఉండే సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

ప్రశ్న) క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పాత్ర మహబూబ్ నగర్ కి చెందిన పండగల సాయన్న అని, సినిమా రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజానిజాలెన్ని?
స) ఆ వార్తల్లో అసలు నిజం లేదు.. ఎవరి ఊహకి తగ్గట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. నాకు తెలిసి ఎవరూ ఓరిజినల్ డీటైల్స్ చెప్పరు. అది ప్రొఫెషనలిజం కాదు కదా..

ప్రశ్న) పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు మూడవ సినిమా చేస్తున్నారు. ఆయనతో మీ అనుభవం గురించి చెప్పండి?
స) పవన్ కళ్యాణ్ ఒక ఎన్సైక్లోపీడియా.. ఆయనకీ తెలియంది విషయం లేదు. సినిమా పరంగా ఆయన 24 క్రాఫ్ట్ లపైన 100% నాలెడ్జ్, కమాండ్ ఉన్న వ్యక్తి. ఆయన స్టార్ గా ఎంత పెద్ద స్టారో, అంతే గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో పరిచయం అనేదే ఓ అదృష్టం. అలాంటి ఆయనతో కలిసి మూడో సినిమా చేయడం అనే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఒకసారి ఆయనతో ప్రయాణం మొదలైతే ఆయనతో ప్రతి సినిమాకి పనిచేయాలనిపిస్తుంది.

ప్రశ్న) సింగీతం శ్రీనివాసరావు – బాలకృష్ణ కలిసి చేయనున్న ‘ఆదిత్య 999’ సినిమాకి మీరే డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారా?
స) బాలయ్య బాబు – సింగీతం గారి సినిమా ఆఫర్ అయితే నా వరకూ ఇంకా రాలేదు. అది కాకుండా సింగీతం గారితో కలిసి ఓ బయోపిక్ కథని సిద్ధం చేసాము. అది లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్. అందులో అయితే బాలయ్య బాబు నటించడం లేదు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ప్రశ్న) శర్వానంద్ శ్రీకారం సినిమా ఎలా ఉండబోతుంది?
స) నూతన దర్శకుడు కిషోర్ చాలా బాగా రాసుకొని, అంతే బాగా తీసిన సినిమా శ్రీకారం. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, మెసేజ్ ఇలా అన్నీ కలగలిపిన సినిమా. ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో ప్రజలకి పక్కాగా చెప్పాల్సిన పాయింట్ ని చూపించే సినిమా శ్రీకారం.

ప్రశ్న) మీరు డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. దానిపై మీ కామెంట్?
స) అవన్నీ ఒట్టి గాలి వార్తలు. ప్రస్తుతం రచయితగా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికైతే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన నా మదిలోకి రాలేదు. భవిష్యత్తులో ఆ ఆలోచన రాదు అని కూడా కచ్చితంగా చెప్పలేను.

ప్రశ్న) సాంఘికం, చారిత్రికం, ప్రేమ కథలు ఇలా అన్ని తరహా సినిమాలకు డైలాగ్స్ రాస్తున్నారు. మీకు ఏ తరహా సినిమాలకి రాయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది?
స) నేను రచయితగా జానర్ తో సంబంధం లేకుండా అన్నిరకాల సినిమాలు రాయడానికి ఇష్టపడతాను. సాయి మాధవ్ బుర్రా అంటే అన్ని జానర్స్ టచ్ చేసాడు, అన్నింటిలో ది బెస్ట్ ఇచ్చాడు అనే సంతృప్తి నాకు కావాలి. ఆ దిశగా నా ప్రయాణం కూడా సాగుతోంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?
స) రవితేజ క్రాక్, శర్వానంద్ శ్రీకారం సినిమాలు దాదాపు షూట్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ ఉన్నాయి. అలాగే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, పవన్ కళ్యాణ్ – క్రిష్ గారి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు చేసే బయోపిక్ కథ ఫినిష్ చేసాం. ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాకి కూడా పని చేస్తున్నాను. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రభాస్ సినిమా గురించి ఏం చెప్పలేను, కానీ అది పాన్ ఇండియా కి మించి పాన్ వరల్డ్ సినిమా అనే రేంజ్ లో ఉంటుందని మాత్రం చెప్పగలను. వి కాకుండా మరో రెండు సినిమాలకి డైలాగ్స్ రాస్తున్నాను.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...