టీం ఇండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్ అప్పుడప్పుడు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇటీవల ఆయన ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జరిగిన రెండో మహిళ వన్డే మ్యాచ్ కు వ్యాఖ్యతగా వ్యవహరించాడు. ఆ సమయంలో బ్యాట్స్ మన్స్ తమ బ్యాట్ల కంటే ఇతర బ్యాట్స్ మన్స్ బ్యాట్లను ఇష్టపడుతారు అంటూ ఇండైరెక్టర్ గా సొంత భార్య కంటే అవతలి వ్యక్తి భార్యను ఇష్టపడుతారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దినేష్ కార్తీక్ వ్యాఖ్యలను నెటిజన్స్ ఒక ఆట ఆడుకున్నారు.
తన తప్పు తెలుసుకున్న దినేష్ కార్తీక్ వెంటనే క్షమాపణ చెప్పాడు. తన వ్యాఖ్యల అర్థం అది కాదని… కొందరు ఆ వ్యాఖ్యలను అపార్థం చేసుకునేలా వక్రీకరించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా తల్లి మరియు భార్య కూడా ఆ వ్యాఖ్యలకు కోపగించుకున్నారు. అందుకే నేను చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రతి ఒక్కరికి కూడ ఆ క్షమాపణ చెబుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన వ్యాఖ్యతగా పనికి రాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా ఆరంభంలో ఇలాంటివి సహజమే అంటూ లైట్ తీసుకుంటున్నారు.
157857 460642Excellent post man, maintain the nice function, just shared this with my friendz 925407