పంచాంగం
తేదీ 25- 05-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు
తిథి: బహుళ విదియ సా.6.31 వరకు తదుపరి తదియ
నక్షత్రం: జ్యేష్ట ఉ.10.37 వరకు తదుపరి మూల
దుర్ముహూర్తం: ఉ. 6.00 నుంచి 7.36 వరకు
శుభ సమయం: సా.5:00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10:30 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు
ఈరోజు (25-05-2024) రాశి ఫలితాలు
మేష రాశి: ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పనుల్లో అలసత్వం వహించడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.
వృషభ రాశి: అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల గురించి ఇతరులతో చర్చించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
మిధున రాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో వాగ్వాదం ఇబ్బంది కలిగిస్తుంది.
కర్కాటక రాశి: విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంబంధ నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం ఉత్తమం. ఇంటి పెద్దల అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.
సింహరాశి: అనుకూల కాలం. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రజాదరణ పెరగడంతోపాటు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
కన్య రాశి: ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం వల్ల భవిష్యత్తు లో సమస్యలకు దారితీస్తుంది. పిల్లల కదలికలపై ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
తులారాశి: కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి: జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. వారిని కుటుంబ సభ్యులకు చేరువ చేస్తారు. గతంలో చేసిన తప్పిదాల వల్ల అధికారుల మందలింపు ఉంటుంది. చాలాకాలంగా వాయిదా పడ్డ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ధనస్సు రాశి: ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మనస్పర్ధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు రుణ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశి: వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
కుంభరాశి: ఆలోచించి ముందడుగు వేయాలి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రతిష్టను పెంచుకుంటారు.
మీన రాశి: ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సామరస్యంగా చర్చించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. బద్ధకాన్ని దరిచేరనీయొద్దు. రుణ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.