పంచాంగం
తేదీ 24- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం,వసంత రుతువు
సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు
తిథి: బహుళ పాడ్యమి సా.6.45 వరకు తదుపరి విదియ
నక్షత్రం: అనురాధ ఉ.9.59 వరకు తదుపరి జ్యేష్ట
దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12.14 నుంచి 1.12 వరకు
శుభ సమయం: సా.5:30 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు
యమగండం: 3.00 నుంచి 4:30 వరకు
ఈరోజు (24-05-2024) రాశి ఫలితాలు
మేష రాశి: ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఉదారత పనికిరాదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
వృషభ రాశి: స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వృషభ రాశి వారికి శుభకాలం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మిధున రాశి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.
కర్కాటక రాశి: శుభకాలం. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడి అంశాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
సింహరాశి: స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బ్యాంకింగ్ లావాదేవీలు కలిసి వస్తాయి. చాలాకాలంగా చేతికందని మొండి బకాయిలను అందుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు అందుతాయి. ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు నెమ్మదిగా మాట్లాడటం మంచిది.
తులారాశి: చాలా కాలంగా పొదుపు చేయాలనుకుంటున్న తులా రాశి వారికి ఇది అనుకూల సమయం. ఈరోజు పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి మిశ్రమకాలం. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. రుణ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.
ధనస్సు రాశి: ఈ రాశి వారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. విదేశాల్లో విద్యని అభ్యసించాలనుకునే వారికి ఇది సరైన సమయం. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు.
మకర రాశి: ఈ రాశి విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు ఊహించిన దాని కంటే రెట్టింపు ఆదాయం పొందే సూచనలు ఉన్నాయి. సమీప బంధువులు, స్నేహితులు మీ సాయం కోరుతారు.
కుంభరాశి: ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి శుభకాలం. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీన రాశి: ముఖ్యమైన పనులు చేపట్టాలనుకునేవారు అప్రమత్తంగా ఉండాలి. సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.