పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణం
సూర్యోదయం: ఉ.5:43
సూర్యాస్తమయం: రా.6:27 ని.లకు
తిథి: అధిక శ్రావణ బహుళ షష్ఠి ఉ.11:19 ని.వరకు తదుపరి అధిక శ్రావణ బహుళ సప్తమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: రేవతి ఉ.8:12 ని.వరకు తదుపరి అశ్వని
యోగం: శూల రా.12:56 ని. వరకు తదుపరి గండ
కరణం: వనిజ.ఉ11:12 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: మ.12:30 ని.నుండి 1:21 ని. వరకు తదుపరి మ.3:03 నుండి 3:54 ని.వరకు
వర్జ్యం : రా.3:32 ని.నుండి 5:04 ని. వరకు
రాహుకాలం: ఉ.7:30 ని. నుండి 9:00 గం.వరకు
యమగండం: ఉ.10:30 ని. నుండి 12:00 గం.వరకు
గుళికా కాలం: మ.1:57 ని. నుండి 3:32 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:24 ని.నుండి 5:12. ని.వరకు
అమృతఘడియలు: ఉ.5:54 ని. నుండి 7:25 ని. వరకు తదుపరి రా.12:26 ని.నుండి 1:59 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:56 ని. నుండి మ.12:47 ని.వరకు
ఈరోజు (07-08-2023) రాశి ఫలితాలు
మేషం: బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిథునం: స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
కర్కాటకం: ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
సింహం: దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కన్య: పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
తుల: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కుటుంబసభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
వృశ్చికం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి.
ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు.
మకరం: బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.
కుంభం: చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మీనం: దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.