పంచాంగం
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ పక్షం
సూర్యోదయం: ఉ.6:22
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: బహుళ విదియ ఉ.11:04 వరకు తదుపరి చవితి
సంస్కృతవారం: ఇందు వాసరః
నక్షత్రము: ఉత్తర ఉ.10:11 వరకు తదుపరి హస్త
యోగం: శూల మ.3:41 వరకు
కరణం: గరజి ఉ .11:04వరకు తదుపరి వనిజ రా.7:11 వరకు
వర్జ్యం: రా.6:08 నుండి రా.7:38వరకు
దుర్ముహూర్తం: మ.12:33నుండి మ.1:19 వరకు తదుపరి మ.2:57 నుండి 3:45
రాహుకాలం: ఉ.7:30 నుండి ఉ. 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ 12:00 వరకు
గుళిక కాలం: మ.1:56నుండి మ.3:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:02 నుండి ఉ.5:50 వరకు
అమృత ఘడియల: రా.12:02 నుండి రా 1:29వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05నుండి మ.12:51 వరకు
ఈ రోజు (01-03-2021) రాశి ఫలితాలు
మేషం: అప్రయత్నంగా పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత ఆలయ దర్శనాలు చేసుకుంటారు .గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది . వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ధన ఇబ్బందులు తప్పవు. ఋణభారం పెరుగుతుంది. కుటుంబమున కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారతాయి. చేపట్టిన పనులలో అలసట పెరుగుతుంది. ఇంటా బయటా సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
మిథునం: చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి. మానసికంగా సమస్యలు కలుగుతాయి. దగ్గర బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
కర్కాటకం: నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఒక విషయం ఆసక్తి కలిగిస్తుంది. విలువైన వస్తు లాభం కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.
సింహం: కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకుగా ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనానికి కొరత కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా ఉపయోగపడవు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభించదు.
కన్య: స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దాయాదుల వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. పుణ్య క్షేత్రాలకు విరాళాలు అందిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది.
తుల: చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. సోదర సంబంధిత వివాదాలలో నష్ట సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు వ్యర్ధంగా మిగులుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం: ఇంట బయట అనుకూలత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి..
ధనస్సు: ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. మిత్రుల శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలుకు ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు.
మకరం: ఇతరులతో తొందరపడి మాట్లాడం వలన ఇబ్బందులు తప్పవు. బంధువులతో ఊహించని వ్యతిరేకత కలుగుతుంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉండవు. .
కుంభం: చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. రుణ యత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. బంధు మిత్రుల విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది.
మీనం: నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన అనుకూలత కలుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘ కాలిక వివాదాలు తొలగి ఉపశమనం కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
2911 90019undoubtedly like your internet internet site but you need to have to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I locate it really troublesome to tell the truth nevertheless I will certainly come back again. 715704
48837 831543When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any means you could get rid of me from that service? Thanks! 927227
92822 516229I dont normally have a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as nicely. Thanks for giving me a big smile for the day 541439
800967 539597Wonderful post man, maintain the nice work, just shared this with the friendz 985361
835015 344707I only wish that I had the ability to convey what I wanted to say within the manner that you have presented this info. Thanks. 807676
366159 637587The site loading velocity is amazing. 717264