Switch to English

కరోనా ట్రీట్‌మెంట్‌: దోచుకున్నోడికి దోచుకున్నంత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘80 శాతం మందికి కరోనా వచ్చినా, వచ్చినట్లే తెలియదు.. మిగతా 20 శాతం మందిలో 15 మందికి సాధారణ స్థాయి వైద్య చికిత్స అవసరమవ్వొచ్చు.. మిగిలిన ఐదు శాతంలోనూ కొంతమందికి మాత్రమే వెంటిలేటర్‌ అవసరమవ్వొచ్చు..’ ఇదీ గత కొద్ది రోజులుగా ఇటు వైద్య నిపుణులు, అటు ప్రభుత్వాలు చెబుతున్న విషయం.

క్రమంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా, మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది కూడా. ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ, కరోనా సోకినా వైద్య చికిత్స కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం వుండదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తి ఉచిత వైద్యం అందిస్తున్న దరిమిలా, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి జేబులు గుల్ల చేసుకోవద్దని సూచించారాయన.

కానీ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ మధ్య మరింత ఎక్కువగా కిటకిటలాడుతున్నాయి కరోనా రోగులతో. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య కంటే, ఆయా వైద్యుల పర్యవేక్షణలో ఇంటివద్ద వుంటూ హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య చాలా చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఈ పరిస్థితి కన్పిస్తోంది. మరోపక్క, ప్రైవేటు ఆసుపత్రుల, వైద్యులు.. హోటళ్ళు, ఇతర భవనాల్లో కరోనా బాధితులకు వైద్య చికిత్స అందిస్తుండడం గమనార్హం. వీటిల్లో చాలావరకు అనధికారిక వ్యవహారాలూ నడుస్తున్నాయి. ఇంట్లో వుంటూ, కుటుంబ సభ్యులకు కరోనా అంటించడం ఇష్టంలేనివారిలో చాలామంది.. ఈ తరహా ఏర్పాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

విజయవాడలో అలాంటిదే ఓ కోవిడ్‌ సెంటర్‌ అగ్ని ప్రమాదానికి గురై 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. లక్షల్లో ఫీజులు తీసుకుంటే, ప్రజల భద్రతను విస్మరించడం అంటే అది వైద్య వృత్తికే అవమానకరం. ‘డిపాజిట్‌ చేస్తే తప్ప ఆసుపత్రుల్లో బెడ్స్‌’ దొరకని పరిస్థితి చాలా చోట్ల కన్పిస్తోంది. కరోనా సోకితే అత్యల్పంగా రెండు మూడు లక్షలు.. లాగేస్తున్నాయి కార్పొరేట్‌ ఆసుపత్రులు.

మరి, ఈ విషయమై ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదు.? ‘మేం నిర్దేశించిన ఫీజులు తప్ప ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు..’ అని అమాత్యులే హెచ్చరిస్తున్నా, ‘హెల్త్‌ మాఫియా’ ఎందుకు పట్టించుకోవట్లేదు.? మొత్తమ్మీద, కరోనా దెబ్బకి ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే, కొందరు అక్రమార్కులు పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డంపెట్టుకుని.. జనాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితులు, కరోనా వైరస్‌ కంటే ఈ కార్పొరేట్‌ వైద్యమే ప్రమాదకరమని వాపోతుండడం గమనార్హం.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...