Switch to English

సీమ అభివృద్ధి.! దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాతన’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

దర్శకుడు మహి వి రాఘవ్ ఓ రాజకీయ సినిమా తీశాడు.! ఒకటి కాదు, రెండు సినిమాలు తీశాడు. తన అభిమాన రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తీసిన సినిమాలవి. మొదటిది ‘యాత్ర’, రెండోది ‘యాత్ర-2’. ముందు ముందు ‘యాత్ర-3’, ‘యాత్ర-4’ ఇలా ఎన్నయినా ఆయన తీయొచ్చుగాక. అది ఆయనిష్టం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం సినిమా తీశాడు గనుక, ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక లబ్దిని మహి వి రాఘవ్ ఆశించి వుంటాడు. మొదటి సినిమాతో ఆ లబ్దిని అందుకుని వుంటాడు. రెండో సినిమాతోనూ లబ్దిని ఆశించి, అందుకుని వుంటాడు.. లేకపోతే, అందుకోబోతుంటాడు.!

అయితే, అందుకోబోయేది వైసీపీ నుంచి అయితే, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావడంతోనే అసలు సమస్య.! ఓ రెండెకరాల భూమి.. కాదు కాదు, ఇరవై ఎకరాల భూమిని మహి వి రాఘవ్‌కి ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోందిట.. అన్నది ఓ వార్త.

పద్ధెనిమిది నెలల క్రితమే సదరు భూమి కోసం మహి వి రాఘవ్ దరఖాస్తు చేసుకున్నాడట. రేపో మాపో అది క్లియర్ అయిపోతుందన్న ప్రచారమూ జరుగుతోంది. మహి వి రాఘవ్ తలచుకుంటే, అంత భూమిని కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ప్రభుత్వం నుంచి తీసుకోవాలనుకోవడమే చిత్రం.

అంత మొత్తంలో భూమిని మహి వి రాఘవ్‌కి కానుకగా వైసీపీ ఇవ్వాలనుకుంటే, అది ప్రైవేటు వ్యవహారమైతే అసలు ఇంత చర్చా అనవసరం. కోరుకున్నది ప్రభుత్వం కేటాయించాల్సిన భూమి కావడంతోనే ఇంత రగడ.!

పైగా, ఇక్కడ ‘సీమ అభివృద్ధికి సినీ పరిశ్రమ బాధ్యత తీసుకోలేదు’ అంటూ రాజకీయ ఆరోపణలు చేశాడు మహి వి రాఘవ్. అంతే కాదు, తానూ సీమ బిడ్డనని చెప్పుకున్నాడు. విక్టిమ్ కార్డ్ తెరపైకి తెచ్చాడు. నిఖార్సయిన పొలిటీషియన్ అయ్యేందుకు మహి వి రాఘవ్‌కి అన్ని అర్హతలూ వున్నట్టే. భూమి ఎందుకు.? వైసీపీ నుంచి ఏదో ఒక టిక్కెట్టు తీసుకోవచ్చు కదా.? పోనీ, ఎమ్మెల్సీగా అవకాశం.? లేదంటే, ఏదన్నా నామినేటెడ్ పోస్ట్.!

ఇంత యాతన ఎందుకు రాఘవా.? జగన్ మోహన్ రెడ్డిని కలిసి పార్టీ పదవి లేదా, ప్రభుత్వంలో ఏదో ఒక పదవి తీసుకోవచ్చు కదా.? ఈ విక్టిమ్ కార్డ్.. రాయలసీమ సెంటిమెంట్.. సినీ పరిశ్రమపైన ఆరోపణలు.. ఇవన్నీ అవసరమా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...