Switch to English

దర్శకులకి మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బౌండెడ్ స్క్రిప్ట్.. అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు చాలా అరుదుగా వినిపిస్తోంది ఈ మాట. ప్రీ ప్రొడక్షన్ అన్న మాటకు అర్థం మారిపోయింది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళాక, అక్కడికక్కడ సన్నివేశాలు రాసుకోవడం, డైలాగ్స్ ప్రిపేర్ చేయడం అన్నది ఈ మధ్య చాలా సినిమాల విషయంలో జరుగుతోంది.

ఎందుకిలా.? ఈ విషయమై గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో బోల్డంత చర్చ నడుస్తోంది. ఈ కారణంగానే సినిమాలు దెబ్బ తింటున్నాయన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. అయినాగానీ, దర్శకుల తీరు మారడంలేదు. సూపర్బ్ కాంబినేషన్.. అంటూ ప్రచారం తప్ప, ఆ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకి కథేంటి.? అన్నదానిపై క్లారిటీ వుండటంలేదు.

ఓహో, ఫలానా టైటిల్ ప్రచారంలో వుంది కదా.. ఆ టైటిల్ ఖరారు చేసేస్తే పోలా.? అని సినీ జనాలు అనుకుంటున్న రోజులివి. మెగాస్టార్ చిరంజీవి, పరిశ్రమ పెద్దగా కాదు.. పరిశ్రమ బిడ్డలా.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న కీలకమైన సమస్య విషయమై బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టు సాక్షిగా, దర్శకులకు క్లాసులు తీసుకున్నారు.

ఓ సినిమాని తాను అంగీకరించాక, సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మూడు నెలల ముందే స్క్రిప్ట్ మొత్తం తనకు అందించాలసిందిగా కోరతానని ఆమిర్ ఖాన్ చెప్పాడు. ఇదే, సినీ పరిశ్రమకు కావాల్సింది ఇదేనంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

‘షూటింగ్ స్పాట్‌లో వేడి వేడిగా టిఫిన్లు వడ్డిస్తుంటారు.. కానీ, నటన మీద ఫోకస్ పెడతాం గనుక, ఆకలెయ్యదు. కానీ, దర్శకులు.. అప్పటికప్పుడు సన్నివేశాల్ని, డైలాగుల్ని వడ్డిస్తున్నారు. అవి అస్సలు మింగుడు పడ్డంలేదు..’ అంటూ సినీ పరిశ్రమ ఇప్పుడెదుర్కొంటున్న సమస్యపై కుండబద్దలుగొట్టేశారు.

మన తెలుగు సినిమా గురించి బాలీవుడ్ చాలా గట్టిగా మాట్లాడుకుంటోంది. ‘చిరంజీవి సర్.. ఢిల్లీలో ఒకప్పుడు మీకు (తెలుగు సినిమాకి) తగిన గౌరవం దక్కలేదని మీరు చెప్పగా నేను విన్నాను. ఇప్పుడు నేను, హిందీ సినీ పరిశ్రమ నుంచి తెలుగు నేలపైకి వచ్చి, మీ ఆశీస్సులు కోరుతున్నాను..’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడంటే, తెలుగు సినీ పరిశ్రమ తాను సంపాదించుకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతలా కష్టపడాలి.?

‘మంచిని బహిరంగంగా చెప్పాలి.. చెడుని చెవిలో చెప్పాలి..’ అని గతంలో చెప్పిన చిరంజీవే, కొందరు దర్శకుల నిర్లక్ష్యాన్ని బహిరంగంగా ఎండగట్టారంటే, ఆయన ఎంతలా ఈ వింత పోకడ పట్ల విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...