Switch to English

మెగా ట్విస్ట్: పవన్ కళ్యాణ్‌కి మద్దతిచ్చిన చిరంజీవి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘మా ఇద్దరి దారులు వేరు.. మేమిద్దరం రైలు పట్టాల్లాంటివాళ్ళం.. మా ప్రయాణం సమాంతరంగా సాగుతుంటుంది.. గమ్యం ఒకటే, కానీ దారులు వేరు.. రెండు రైలు పట్టాలు కలవడం కష్టం కదా.. అలాగే, మా ఆలోచనలు కూడా..’ అంటూ పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి, తన సోదరుడు పవన్ కళ్యాణ్ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, చేస్తూనే వున్నారు.

‘అదిగో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు.. ఇద్దరూ దూరం దూరంగా వుంటున్నారు..’ అంటూ మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తూనే వుంటాయి. ఏదన్నా విషయమ్మీద చిరంజీవి వాదన ఒకలా, పవన్ కళ్యాణ్ వాదన ఇంకోలా అనిపిస్తే చాలు, తెలుగు మీడియా గోరంతని కొండంతగా మార్చేసి, ప్రజల్ని ఏమార్చేసేలా కథనాల్ని తెరపైకి తెస్తుంటుంది.

అదే సమయంలో, ఇటు మెగాస్టార్ చిరంజీవి.. అటు పవన్ కళ్యాణ్.. ఇద్దరూ సమయం వచ్చినప్పుడు ఆయా గాలి వార్తలకీ, గలీజు విశ్లేషణలకీ తమ చేతలతో చెక్ పెడుతుంటారు. ‘మా’ ఎన్నికల వేళ జరిగిన రాద్ధాంతం అందరికీ గుర్తుండే వుంటుంది. చిరంజీవి ఏదన్నా విషయమ్మీద మాట్లాడాలనుకుంటే, కాస్త ఆచి తూచి వ్యవహరిస్తారు. ఈ క్రమంలో మీడియా తప్పుడు రాతలకి ఆస్కారం ఎక్కువ దొరుకుతుంటుంది.

పవన్ విషయానికొస్తే, విషయం ఏదైనా కుండబద్దలుగొట్టేయడం ఆయనకు అలవాటు. తన తమ్ముడి వ్యవహారశైలి గురించి తాజాగా చిరంజీవి స్పష్టమైన విశ్లేషణ చేసేశారు.. గాలి వార్తలకి స్పష్టంగా చెక్ పెట్టేశారు. ‘పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అందులో నిజాయితీ వుంటుంది. న్యాయం తరఫున పవన్ నిలబడతాడు..’ అంటూ తన సోదరుడి గురించి చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ చాలామందికి షాక్ ఇచ్చాయి.

చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన, ప్రయత్నిస్తూనే వున్న చాలామందికి.. రాజకీయ నాయకులకీ, వారి మద్దతుదారులకీ, అలాగే బులుగు మరియు పచ్చ మీడియాకి.. చిరంజీవి ఇచ్చిన వివరణతో మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...