మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య వివిధ కారణాల కారణంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మొన్నటి దాకా ఈ సినిమా కాపీ ఆరోపణలను ఎదుర్కొంది. ఒక రచయిత తన ఐడియాను కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నారని ఆరోపించడంతో ఈ సినిమా వివాదాల్లో నలిగింది. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ కథపై క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఆచార్య ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ ఫస్ట్ లుక్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది.
అసలైతే ఆచార్య ఈ పాటికి పూర్తైపోయి ఉండాలి కానీ కరోనా కారణంగా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. లాక్ డౌన్ కు ముందు ఆచార్య దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి మాజీ నక్సలైట్ పాత్ర కాగా మరొకటి ఆలయంలో వడ్రంగి పనిచేసే వ్యక్తిగా చిరంజీవి కనిపిస్తారని సమాచారం.
రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ప్రముఖమైన పాత్రలో కనిపిస్తారు. దాదాపు 30 నిమిషాల నిడివున్న పాత్ర ఆయనదని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
988078 496958excellent post. Neer knew this, thankyou for letting me know. 566635
279195 643337Thank you, Ive just been looking for data about this subject for a whilst and yours is the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you sure concerning the supply? 132042
901428 687956Certainly,Chilly spot! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 423451