Switch to English

తప్పంతా చిరంజీవిదేనా.? ఎందుకు ఆయనే టార్గెట్ అవుతున్నారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి మీద ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యవహరించిన అభ్యంతరకరమైన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవిని అభిమానించే వందలాది, వేలాది మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఔన్నత్యం గురించి పేర్కొంటున్నారు.

సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మేరకు స్పందిస్తున్న వైనాన్ని చూస్తుంటాం. చిరంజీవితో రాజకీయంగా గతంలో విభేదించినవారు, ఇతరత్రా సందర్భాల్లో చిరంజీవి తీరుని తప్పుపట్టినవాళ్ళు కూడా ఇప్పుడు చిరంజీవిన ఔన్నత్యం గురించి గొప్పగా మాట్లాడుతుండడం ఆశ్చర్యకరమైన విషయమే.

ఈ వందలాది, వేలాది మంది ప్రముఖులకు వున్నంత సంయమనం, సాధారణ సినీ అభిమానులకు వుండదు కదా.? నిజానికి, ఈ ప్రముఖుల్లోనూ చాలామంది తీవ్ర అసహనానికి గురవుతున్నా, ఒకింత సంయమనం పాటించక తప్పడంలేదు. ఎందుకంటే, తమ వ్యాఖ్యల ద్వారా చిరంజీవి ఔన్నత్యానికి ఏమైనా మచ్చ ఏర్పడుతుందా.? అని ఒకింత ‘అతి’ సంయమనం ప్రదర్శించక తప్పడంలేదు.

ఒక కార్యక్రమంలో పలువురు వ్యక్తులు పాల్గొంటున్నప్పుడు, ఒకర్ని ఇంకొకరు అదిలించి, బెదిరించే పరిస్థితి వుండకూడదు. కానీ, చిరంజీవి మీద డామినేషన్ ప్రదర్శించేందుకు గరికపాటి నరసింహారావు ప్రయత్నించారు. అదే ఆయన చేసిన తప్పు. ‘మీరు ఫొటో సెషన్ ఆపుతారా, నేను వెళ్ళిపోవాలా.?’ అని అల్టిమేటం జారీ చేయడం ఏదైతే వుందో, అంతకన్నా హేయం ఇంకోటుండదు.

ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న పాండిత్యం, ప్రదర్శిస్తున్న పాండిత్యం.. అంతా ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. ఇకపై ‘నేను పండితుడ్ని’ అని చెప్పుకోవడానికి కూడా గరికపాటి అనర్హుడవుతారేమో.! ఆ స్థాయికి ఆయన తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేసుకున్నాడు. గరికపాటి దిగజార్చేసుకున్నాడు సరే.. చిరంజీవి హుందాతనాన్ని కోల్పోలేదు. అదే నక్కకీ నాకలోకానికీ వున్నంత తేడా అంటే.!

‘చిరంజీవిదే తప్పు.. ఇలాంటోళ్ళని ఉపేక్షిస్తున్నారు.. అందుకే ఆయన ఈజీ టార్గెట్ అవుతున్నారు..’ అని చాలామంది భావించొచ్చుగాక.! ఏనుగు వెళుతోంటే చాలా మొరుగుతాయ్. వాటిని పట్టించుకుంటారా.? అన్నది ఇక్కడ ఎంతవరకు ప్రస్తావనార్హం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయ్. అలా మొరిగేవాటి గురిచి సభా మర్యాద పాటించి అయినా మంచి మాటలు చెప్పడం చిరంజీవి చేస్తున్న తప్పిదమని అనుకోవాలేమో.!

8 COMMENTS

  1. 230412 765079After I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 616458

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...