Switch to English

Chiranjeevi Birthday Special: చిరంజీవి డేరింగ్ డెసిషన్.. కెరీర్ పీక్స్ లో అతిపెద్ద సాహసం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చిరంజీవిలోని యాంగ్రీ, డైనమిక్ స్కిల్స్ యువతకు విపరీతంగా ఆకట్టుకుంటున్న దశలో వచ్చిన సినిమాల్లో.. సినిమా మొత్తం చిరంజీవే. ఆయన కోసమే సినిమా అంటే ధియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఆ దశలో చేసినవే చిరంజీవి, చట్టంతో పోరాటం, రుస్తుం సినిమాలు ఉన్నాయి. తన పేరుతోనే వచ్చిన సినిమా చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి చాలా పెద్ద ప్రయోగమే చేశారు. క్లైమాక్స్ లో చిరంజీవి పాత్ర చనిపోతుంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో పాత్ర చనిపోవడం సినిమాపైనే ఎఫెక్ట్ పడుతుంది. ఫలితమెలా ఉన్నా చిరంజీవి లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో నటించారు. ఫస్ట్ సాంగ్ సినిమాకే హైలైట్. కథలో భాగంగా చిరంజీవి కాస్త చూపిన నెగటివ్ షేడ్స్, భావోద్వేగం, హావభావాలతో నటించి మెప్పించారు. ఈ సినిమాలో నటించడం చిరంజీవి చేసిన పెద్ద సాహసంగా చెప్పుకోవాలి.

చట్టంతో పోరాటం..

చట్టంతో పోరాటం సినిమా చిరంజీవి కెరీర్లో మంచి హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కథ, కథనం, చిరంజీవి, పాటలు, యాక్షన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. చిరంజీవి పాత్ర చాలా యాంగ్రీనెస్ తో కూడుకున్నది. విలన్ తో సన్నివేశాల్లో చిరంజీవి డైలాగ్ వెర్షన్, నటన సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి. జైలు, కోర్టు సన్నివేశాల్లో చిరంజీవి యాంగ్రీ నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫైట్స్ లో చిరంజీవి మరింతగా మెప్పించారు. అప్పటి చిరంజీవి ఇమేజ్ కు తగ్గ కథ కావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. పాటల్లో చిరంజీవి మార్క్ డ్యాన్సులు కిక్కెక్కిస్తాయి. అప్పటికే చిరంజీవితో సినిమాలు చేసి ఆయన స్పార్క్ ని చూసిన నిర్మాత కె.దేవీవరప్రసాద్ తర్వాతా చిరంజీవితోనే వరుస సక్సెస్ లు సాధించిన సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది.

రుస్తుం..

రుస్తుం సినిమా చిరంజీవి చేసిన అనేక రివెంజ్ డ్రామాల్లో ఒకటి. అయితే.. ఓ దశలో ఇంతై ఇంతింతై అన్నట్టు పెరుగుతున్న చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా ఇది. సినిమాలో చిరంజీవి ఎంట్రన్స్, ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఒంటిపై బనియన్, సిగరెట్ కాలుస్తూ చిరంజీవిలోని పూర్తి మాస్ మోడ్ ని ఉపయోగించి తీసిన ఫైట్ స్పెషల్ గా నిలిచింది. కుర్చీలో కూర్చుని బల్ల మీద కాలు పెట్టి సిగరెట్ కాల్చే స్టిల్ చిరంజీవికి మాత్రమే ప్రత్యేకం అనే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఎద్దుతో ఫైట్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమాలో చిరంజీవి లుక్స్, కామెడీ, పాటలు ఆకట్టుకుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....